Begin typing your search above and press return to search.

ఆ కళ్లలోని కరుణ చూపిస్తే సగం విజయం సాధించినట్లే!

సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నటిస్తున్న నటి రష్మిక మందన్నపై విపరీతమైన భారం, బాధ్యత ఉన్నాయో? తెలిపేందుకు విశ్వనటుడు కమల్ హాసన్ ఓ ఆసక్తికర పోలికను పంచుకున్నారు.

By:  Srikanth Kontham   |   17 Sept 2026 10:54 PM IST
ఆ కళ్లలోని కరుణ చూపిస్తే సగం విజయం సాధించినట్లే!
X

సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నటిస్తున్న నటి రష్మిక మందన్నపై విపరీతమైన భారం, బాధ్యత ఉన్నాయో? తెలిపేందుకు విశ్వనటుడు కమల్ హాసన్ ఓ ఆసక్తికర పోలికను పంచుకున్నారు. మైఖేల్ జాక్సన్ లాంటి అంతర్జాతీయ పాప్ దిగ్గజం బయోపిక్‌లో నటించేటప్పుడు ఒక నటుడిపై ఎలాంటి ఆందోళన, ఒత్తిడి ఉంటాయో.. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి మహోన్నతమైన పాత్రను పోషిస్తున్న రష్మిక కూడా సరిగ్గా అదే స్థాయి ఒత్తిడిని అనుభవిస్తుందని వ్యాఖ్యానించారు.

ప్రపంచ సంగీతంలో మైఖేల్ జాక్సన్ సాధించిన ప్రాచుర్యం, ఆయన శైలిని అనుకరిస్తూ మెప్పించడం ఎంతటి కష్టసాధ్యమైన విషయమో? భారతీయ శాస్త్రీయ సంగీతంలో భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పాత్రను పండించడం కూడా అంతే సవాలుతో కూడుకున్న పని. తరతరాలుగా కోట్లాది మంది భక్తులు, సంగీత ప్రియుల గుండెల్లో దైవసమానమైన స్థానాన్ని పొందిన ఎం.ఎస్. అమ్మ ప్రతిరూపాన్ని వెండితెరపై పునసృష్టించడం సాధారణమైన విషయం కాదు. ఈ స్థాయి దిగ్గజాల జీవిత కథల్లో నటించడం అంటే నటులకు అత్యంత క‌ఠిన‌మైన‌ పరీక్షే.

ఇలాంటి ఒత్తిడిని రష్మిక ఎలా అధిగమించవచ్చో కమల్ హాసన్ విలువైన సూచనలు చేశారు. కేవలం బాహ్య రూపం, మేకప్ .. వేషధారణతోనే ఇలాంటి పాత్రలకు పూర్తి న్యాయం చేయలేమని అభిప్రాయపడ్డారు. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి కళ్లలో కనిపించే అనంతమైన కరుణ, ప్రశాంతతలను తన చూపుల్లో రష్మిక ప్రతిబింబించగలిగితే, ఆమె పాత్రలో సగం విజయం సాధించినట్లేనని కమల్ మార్గదర్శనం చేశారు. ఆంతరంగిక భావోద్వేగాలను పండించడమే ఈ పాత్రకు ప్రాణవాయువు క‌మ‌ల్ నొక్కి చెప్పారు.

సంగీత దిగ్గజం పాత్రను పోషించేటప్పుడు నటులకు ఎదురయ్యే ఒత్తిడి స‌హ‌జ‌మే అయినా? దాన్ని తగ్గించేందుకు చిత్ర బృందం తోడ్పాటు ఎంతగానో ఉపయోగపడుతుందని కమల్ పేర్కొన్నారు. దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణుల సమిష్టి కృషి రష్మికలోని ఆందోళనను తొలగించి అత్యుత్తమ ప్రతిభను బయటకు తీసేందుకు దోహదపడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. మైఖేల్ జాక్సన్ స్థాయి ప్రభావం ఉన్న ఈ పాత్రలో రష్మిక ఎంతో ధైర్యంతో? ఆత్మవిశ్వాసంతో? అడుగుపెట్టి ముందుకు సాగాలని ప్రోత్సహించారు.

సమాజంలో చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తుల బయోపిక్‌లు తెరకెక్కుతున్నప్పుడు ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి భారీ అంచనాలు ఉండటం సర్వసాధారణం. మైఖేల్ జాక్సన్ బయోపిక్ విషయంలో నటుడు ఎలాంటి అగ్నిపరీక్షను ఎదుర్కొంటాడో? ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పాత్ర విషయంలోనూ రష్మిక ముందు అలాంటి సవాళ్లే ఉన్నాయి. సోషల్ మీడియాలో వ్య‌క్త‌మ‌వుతోన్న‌ అనుమానాలు, విమర్శలను పక్కన పెట్టి తన అద్భుత నటనతో వీట‌న్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ర‌ష్మిక‌పై పై ఉంది. ప్ర‌స్తుతం ర‌ష్మిక మూడు చిత్రాల్లో న‌టిస్తోంది.ఆ సినిమా షూటింగ్ లు కూడా ఓ కొలిక్కి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ర‌ష్మిక సుబ్బ‌ల‌క్ష్మి బ‌యోపిక్ పూర్తి చేసే వ‌ర‌కూ మ‌రో కొత్త ప్రాజెక్ట్ కు క‌మిట్ అయ్యే అవ‌కాశం కూడా ఉండ‌క‌పోవ‌చ్చు. ఎంతో ఏకాగ్ర‌త‌తో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ కాబ‌ట్టి ర‌ష్మిక కొంత కాలం క‌మిట్ మెంట్ల‌కు దూరంగా ఉండొచ్చు.