Begin typing your search above and press return to search.

ఆఫ్ స్క్రీన్ ప్ర‌వ‌ర్త‌న‌తో న‌టీన‌టుల‌ను ముడిపెట్ట‌డం స‌రైన‌దేనా?

అయితే సుబ్బుల‌క్ష్మి జీవిత‌క‌థతో సినిమాని ప్ర‌కటించినా ర‌ష్మిక‌పై విమ‌ర్శ‌ల దాడి మాత్రం ఎక్కువ అవుతూనే ఉంది.

By:  Sivaji Kontham   |   19 Sept 2026 1:14 PM IST
ఆఫ్ స్క్రీన్ ప్ర‌వ‌ర్త‌న‌తో న‌టీన‌టుల‌ను ముడిపెట్ట‌డం స‌రైన‌దేనా?
X

ఏదైనా వేదిక‌పై త‌క్ష‌ణ ప్ర‌వ‌ర్త‌నను ఆ న‌టి లేదా న‌టుడు తెర‌పై పోషించ‌బోయే పాత్ర‌తో ముడిపెట్టి మాట్లాడ‌టం పూర్తిగా అసంబ‌ద్ధం. ఇంత‌కుముందు నితీష్ తివారీ తెరకెక్కించిన `రామాయ‌ణం`లో శ్రీ‌రాముడి పాత్ర‌కు ర‌ణ‌బీర్ క‌పూర్ అసలు సూట్ కాడంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లొచ్చాయి. కానీ ర‌ణ‌బీర్ బెస్ట్ ఆప్ష‌న్ అని నిరూపించే ప్ర‌యత్నాలను ద‌ర్శ‌కుడు నితీష్ తివారీ చేస్తున్నారు. తెర‌వెన‌క వ్యక్తిగత విషయాలు ఎలా ఉన్నా.. ర‌ణ‌బీర్ ని ఆద‌ర్శ‌పురుషుడు రాముడిగా ప్ర‌జ‌లు చూసి ఆద‌రించాల్సిందే. అత‌డు వెండితెర‌పై రాముడిలా క‌నిపించి మెప్పించాడా లేదా? త‌న పాత్ర‌కు ఏమేర‌కు న్యాయం చేసాడు? అనేది మాత్ర‌మే ప్రేక్షకులు చూస్తారు.

ఇక భార‌త‌ర‌త్న‌, సంగీత దిగ్గ‌జం ఎం.ఎస్. సుబ్బుల‌క్ష్మి జీవిత‌క‌థ‌లో న‌టిస్తున్న ర‌ష్మిక మంద‌న్న‌పైనా ప్రస్తుతం ఇదే విధంగా విమ‌ర్శ‌లు వేడెక్కిస్తున్నాయి. ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ లో ర‌ష్మిక ప్ర‌వ‌ర్త‌న‌ తీరు సరిగా లేదంటూ.. అందువల్ల త‌ను ఆ లెజెండ‌రీ సుబ్బుల‌క్ష్మి పాత్ర‌కు స‌రిపోదంటూ కొంద‌రు సోషల్ మీడియాలో విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. అయితే నిజానికి `యానిమ‌ల్` చిత్రంలో ర‌ష్మిక నటనను చూడ‌క ముందు కొందరు తొలుత విమర్శించినా.. ఆ తర్వాత త‌న‌ న‌ట‌న‌ను చూశాక ప్ర‌శంసించిన విష‌యం ఎప్పుడూ మ‌రువ‌కూడదు. ముందుగా ఇలాంటి విమ‌ర్శ‌లు రావడం.. ఆ తర్వాత వాటిని నటనతో తిప్పికొట్టడం న‌టీన‌టుల‌కు ఒక సాధారణ విషయంగా మారింది.

అయితే సుబ్బుల‌క్ష్మి జీవిత‌క‌థతో సినిమాని ప్ర‌కటించినా ర‌ష్మిక‌పై విమ‌ర్శ‌ల దాడి మాత్రం ఎక్కువ అవుతూనే ఉంది. అయితే తనపై వస్తున్న విమర్శలన్నింటికీ తన అద్భుతమైన న‌ట‌న‌తోనే ర‌ష్మిక గట్టి జవాబు చెబుతుంద‌ని అభిమానులు గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి స‌హా నిర్మాతలు ఉంచిన న‌మ్మ‌కాన్ని ర‌ష్మిక పూర్తిగా నిల‌బెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది.

ఒకప్పుడు సావిత్రి బయోపిక్ `మహానటి`లో ఆ పాత్ర‌కు కీర్తి సురేష్‌ను ఎంపిక చేసుకున్న‌ప్పుడు కూడా కొన్ని వర్గాల నుంచి తీవ్రమైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ కీర్తి సురేష్ ఆ పాత్ర‌లో పరకాయ ప్రవేశం చేసి జీవించిన తీరుకు ఏకంగా జాతీయ అవార్డు దక్కింది. ఇప్పుడు ర‌ష్మిక‌కు కూడా కెరీర్‌లో అలాంటిదే ఒక అరుదైన అవకాశం లభించింది. లెజెండ్ ఎం.ఎస్. సుబ్బుల‌క్ష్మి పాత్ర‌లో ఒదిగిపోవాలంటే ర‌ష్మిక అక్షరాలా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయాల్సి ఉంటుంది.

ఈ బృహత్తర సవాల్‌ను స్వీకరించి ర‌ష్మిక ఎలా ముందుకు సాగుతుందో అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఒక ప్రముఖ సంగీత‌జ్ఞురాలిగా తెరపై కనిపించాలంటే ర‌ష్మిక ముంద‌స్తుగా చాలా కఠినమైన ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ర‌ష్మిక‌ అదే త‌ర‌హా ప్రిప‌రేష‌న్ లో ఉంద‌ని సమాచారం అందుతోంది. ర‌ష్మిక విష‌యం అటుంచితే.. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర కాస్ట్ అండ్ క్రూ పూర్తి వివ‌రాలు త్వ‌రలోనే అధికారికంగా వెల్లడ‌వుతాయని తెలుస్తోంది.