Begin typing your search above and press return to search.

సుబ్బులక్ష్మి బయోపిక్.. 'మహానటి'లా ఒదిగిపోతే..

ఎం.ఎస్ అనే టైటిల్ తో రానున్న ఆ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, ఎమోషన్స్ ను స్క్రీన్ పై స్టార్టింగ్ గా చూపించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

By:  M Prashanth   |   17 Sept 2026 10:20 AM IST
సుబ్బులక్ష్మి బయోపిక్.. మహానటిలా ఒదిగిపోతే..
X

ఒక లెజెండరీ సెలబ్రిటీ లైఫ్ స్టోరీని సిల్వర్ స్క్రీన్ పై చూపించడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఎక్స్ప్రెషన్స్, మాట తీరు, పర్సనాలిటీ ప్రేక్షకులకు ఇప్పటికే బాగా తెలిసి ఉంటే.. ఆ పాత్రలో నటించే హీరోయిన్‌ పై అంచనాలు మరింత పెరుగుతాయి. ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన్న ముందున్న సవాలు కూడా అలాంటిదే. భారతరత్న సుబ్బులక్ష్మి జీవిత కథతో తెరకెక్కుతున్న బయోపిక్‌ లో ఆమె లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఆ సినిమా ప్రారంభం కావడంతోనే మహానటి అందరికీ గుర్తుస్తోంది.

సావిత్రి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన మహానటిలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించారు. స్క్రీన్ పై కీర్తి కనిపించకుండా సావిత్రినే చూస్తున్నామనే ఫీలింగ్ కలిగేలా పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా సావిత్రి నవ్వు, బాధ, ఎమోషన్స్ ను ఆమె చూపించిన తీరు సినిమాకు మెయిన్ అసెట్ గా మారింది. ఆ రోల్ కు కీర్తికి నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. దీంతో ఇప్పుడు సుబ్బులక్ష్మి బయోపిక్ లో రష్మిక ఎలా కనిపిస్తారనే ఆసక్తి మొదలైంది.

అయితే ఎం.ఎస్. సుబ్బులక్ష్మి మామూలు సింగర్ కాదు. కర్ణాటక మ్యూజిక్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని, ఇండియాలో కోట్లాది మంది అభిమానాన్ని పొందిన ఆర్టిస్ట్. అలాంటి పర్సన్ లైఫ్ ను స్క్రీన్ పై చూపించాలంటే కేవలం కంపేరిజన్ ఉంటే సరిపోదు. ఆమె మ్యూజిక్ జర్నీ, పర్సనాలిటీ, ఎమోషన్స్, లైఫ్ లో కొన్ని ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్స్ ను ప్రేక్షకులకు నమ్మేలా చూపించాలి. అందుకే ఆ రోల్ రష్మిక కెరీర్‌ లో కూడా చాలా ప్రత్యేకంగా మారనుంది.

ఎం.ఎస్ అనే టైటిల్ తో రానున్న ఆ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, ఎమోషన్స్ ను స్క్రీన్ పై స్టార్టింగ్ గా చూపించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే సుబ్బులక్ష్మి జీవితంలోని ఎమోషనల్ యాంగిల్స్ ను దర్శకుడు ఎలా చూపించబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ ప్రాజెక్టును అల్లు అరవింద్, రాక్‌ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ కలిసి నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

చెన్నైలో జరిగిన లాంఛింగ్ ఈవెంట్ లో కమల్ హాసన్ రష్మిక తొలి సీన్ కు క్లాప్ కొట్టారు. సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా జరిగిన ఆ ఈవెంట్ నిర్వహించడం విశేషం. అయితే సుబ్బులక్ష్మి ఫ్యామిలీ మూవీ టీమ్ తోపాటు రష్మిక కలిసి వారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం, వారితో మాట్లాడడం సినిమాపై ఉన్న బాధ్యతను చూపిస్తోంది. అదే సమయంలో సుబ్బులక్ష్మి రోల్ తనకు దక్కడం ఆశీర్వాదంగా భావిస్తున్నానని రష్మిక చెప్పారు.

ఇది చాలా పెద్ద బాధ్యత అని, తన వంతు పూర్తి న్యాయం చేసేందుకు హార్డ్ వర్క్ చేస్తానని తెలిపారు. అన్ని జెనరేషన్స్ ఆడియన్స్ కనెక్ట్ కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అలా జరగాలంటే మహానటిలో కీర్తి సావిత్రిగా ఎలా ఒదిగిపోయారో.. సుబ్బులక్ష్మిగా రష్మిక కూడా అదే రేంజ్ లో పాత్రలోకి వెళ్లగలిగితే చాలని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి నేషనల్ క్రష్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.