Begin typing your search above and press return to search.

జెన్ జీ పెళ్లి గురించి ఏం ఆలోచిస్తోంది.. రష్మిక ఏమన్నారంటే?

పెళ్లి అనేది కేవలం సమాజం పెట్టిన రూల్స్ కోసమో, ఎవరో ఏదో అనుకుంటారనో చేసుకోవాల్సిన అవసరం లేదని రష్మిక తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

By:  Madhu Reddy   |   19 Jun 2026 2:00 PM IST
జెన్ జీ పెళ్లి గురించి ఏం ఆలోచిస్తోంది.. రష్మిక ఏమన్నారంటే?
X

ప్రస్తుత జనరేషన్ (జెన్-జీ) లైఫ్ స్టైల్, ఆలోచనలు పాత తరంతో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటున్నాయి. ముఖ్యంగా 'పెళ్లి' అనే కాన్సెప్ట్‌ను ఈ తరం యూత్ చూసే విధానం పూర్తిగా మారిపోయింది. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి, అలాగే నేటి యువత ఆలోచనా తీరు గురించి కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బోల్డ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం..

పెళ్లి ఒక అవుట్ డేటెడ్ కాన్సెప్ట్?:

ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో రష్మికకు నేటి తరం జెన్-జీ పెళ్లిని ఒక ‘అవుట్ డేటెడ్’ కాన్సెప్ట్‌గా భావిస్తోందనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె చాలా ప్రాక్టికల్‌గా స్పందించారు. సమాజం పెళ్లి విషయంలో కొన్ని కఠినమైన రూల్స్ పెట్టిందని, ముఖ్యంగా అమ్మాయిలకు ఒక నిర్దిష్ట వయసు రాగానే కచ్చితంగా పెళ్లి చేసేయాలనే ఒత్తిడి తెస్తుందని రష్మిక అన్నారు. ఇక సొసైటీ పెట్టిన ఇలాంటి రూల్స్ నచ్చకే నేటి యూత్ పెళ్లికి దూరంగా ఉండాలని ఆలోచిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.

సమాజం రూల్స్ కాదు.. పార్ట్‌నర్స్ ఇష్టం ముఖ్యం:

పెళ్లి అనేది కేవలం సమాజం పెట్టిన రూల్స్ కోసమో, ఎవరో ఏదో అనుకుంటారనో చేసుకోవాల్సిన అవసరం లేదని రష్మిక తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. పెళ్లి బంధంలోకి అడుగుపెట్టే ఇద్దరు భాగస్వాములు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, వారు కలిసి ఎలా ఉండాలనుకుంటున్నారు అనేదే అన్నింటికంటే ముఖ్యమని స్పష్టం చేశారు. ఇక సమాజం కండిషన్ల కంటే పార్ట్‌నర్స్ ఇష్టానికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని రష్మిక అన్నారు.

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో రష్మిక లైనప్:

ఒకవైపు ఇలాంటి బోల్డ్ స్టేట్‌మెంట్లతో వార్తల్లో నిలుస్తున్న రష్మిక.. సినిమాల పరంగానూ ఈ ఏడాది ఫుల్ జోరు చూపిస్తోంది. ఆమె నటించిన ‘కాక్‌టైల్ 2’ ఈరోజే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. దీనితో పాటు ఈ ఏడాది మరో రెండు భారీ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ సరసన ఆమె నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘రణబాలి’ సెప్టెంబర్‌లో విడుదల కానుంది. అలాగే ఆమె లేడీ ఓరియెంటెడ్ ప్యాన్-ఇండియా యాక్షన్ చిత్రం ‘మైసా’ డిసెంబర్ కానుకగా థియేటర్లలోకి రాబోతోంది.

ఇక పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత విషయమని, దానికి సమాజం గీసిన గీతలే ప్రామాణికం కాదంటూ రష్మిక చేసిన కామెంట్స్ నూటికి నూరు పాళ్ళు నిజమని నేటి యూత్ సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా పెళ్లి విషయంలో సొసైటీ ప్రెజర్‌ను పక్కన పెట్టాలనే రష్మిక మాటలకు కొందరు సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈరోజే విడుదలైన కాక్‌టైల్ 2 మరియు రాబోయే రణబాలి, మైసా చిత్రాలతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రష్మిక ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.