Begin typing your search above and press return to search.

లాయి లే లాయి లే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' లవ్లీ లవ్ ట్రాక్

రష్మిక మందన్న నటిస్తున్న 'ది గర్ల్‌ఫ్రెండ్' నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేసింది. "లాయి లే లాయి లే" అంటూ సాగే ఈ మూడో సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

By:  M Prashanth   |   30 Oct 2025 5:15 PM IST
లాయి లే లాయి లే.. ది గర్ల్‌ఫ్రెండ్ లవ్లీ లవ్ ట్రాక్
X

రష్మిక మందన్న నటిస్తున్న 'ది గర్ల్‌ఫ్రెండ్' నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేసింది. "లాయి లే లాయి లే" అంటూ సాగే ఈ మూడో సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్, సినిమాలోని లవ్ స్టోరీ ఫీల్‌ను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేస్తోంది. కపిల్ కపిలన్ వాయిస్, రాకేందు మౌళి లిరిక్స్ చాలా ఫ్రెష్‌గా, యూత్‌ఫుల్‌గా ఉన్నాయి.




ఈ లిరికల్ వీడియోలో చూపించిన విజువల్స్ సినిమా కథపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో హీరో దీక్షిత్ శెట్టి, హీరోయిన్ రష్మిక మధ్య నడిచే లవ్ ట్రాక్‌ను ఈ పాటలో చాలా అందంగా చూపించారు. ఒకరినొకరు చూసుకోవడం, కాలేజీ కారిడార్లలో ఎదురుపడటం, ఇద్దరి మధ్య చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్.. ఇలా అన్నీ ఒక క్లాసిక్ లవ్ స్టోరీకి కావాల్సిన ఫీల్‌ను ఇస్తున్నాయి.

అయితే, ఈ పాటను ప్రమోట్ చేస్తూ మేకర్స్ వాడిన క్యాప్షన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంటే, ఈ పాటలో మనం చూస్తున్న ఈ అందమైన ప్రేమకథ, ఈ ఛేజింగ్.. అంతా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నా, దీని వెనుక పెద్ద తుఫానే రాబోతోందని డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఒక హింట్ ఇచ్చాడు. ఇది రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌కు కూడా కనెక్ట్ అవుతోంది.

ట్రైలర్‌లో మొదట లవ్‌లీగా మొదలైన కథ, ఆ తర్వాత ఇంటెన్స్, డార్క్ డ్రామాగా మారుతుందని చూపించారు. ఇప్పుడు ఈ పాటతో ఆ పాయింట్‌ను మరింత బలంగా చెప్తున్నారు. ఈ "లాయి లే" పాటలో ఉన్న ప్రశాంతత, సినిమా సెకండాఫ్‌లో ఉండకపోవచ్చు. మొత్తానికి, ఈ పాట ఒకవైపు మెలోడీతో ఆకట్టుకుంటూనే, మరోవైపు సినిమాలోని సీరియస్ డ్రామా గురించి ఆడియెన్స్‌ను ప్రిపేర్ చేస్తోందని అనిపిస్తోంది.

గీతా ఆర్ట్స్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా, కేవలం రొటీన్ లవ్ స్టోరీ కాదని, రిలేషన్‌షిప్స్‌లోని కాంప్లెక్సిటీస్‌ను చాలా డీప్‌గా చూపించబోతోందని అర్థమవుతోంది. నవంబర్ 7న రిలీజ్ కానున్న ఈ సినిమా, రష్మికకు పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న మరో మంచి పాత్రను ఇవ్వబోతోందనిపిస్తోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యేలా ఉంది. ఈ 'ఛేజింగ్' వెనుక ఉన్న ఆ సీరియస్ పాయింట్ ఏంటో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.