Begin typing your search above and press return to search.

కాంచనకి శ్రీవల్లి తోడైతే.. పాన్‌ ఇండియా రచ్చ ఖాయం!

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో వచ్చిన పుష్ప ప్రాంచైజీ మూవీలో శ్రీవల్లి పాత్రను పోషించడం ద్వారా రష్మిక మందన్న పాన్‌ ఇండియా రేంజ్‌లో మంచి గుర్తింపు దక్కించుకుంది.

By:  Ramesh Palla   |   17 Sept 2025 11:32 AM IST
కాంచనకి శ్రీవల్లి తోడైతే.. పాన్‌ ఇండియా రచ్చ ఖాయం!
X

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో వచ్చిన పుష్ప ప్రాంచైజీ మూవీలో శ్రీవల్లి పాత్రను పోషించడం ద్వారా రష్మిక మందన్న పాన్‌ ఇండియా రేంజ్‌లో మంచి గుర్తింపు దక్కించుకుంది. పుష్ప తర్వాత హిందీలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాలు అక్కడ చేయడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బాలీవుడ్‌ నుంచి బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలు వస్తున్నప్పటికీ రష్మిక మందన్న సౌత్‌ సినిమాలను కొనసాగిస్తూనే ఉంది. అంతే కాకుండా కొన్ని లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. ఈ సమయంలో ఈమెను ప్రముఖ కొరియోగ్రాఫర్‌ కమ్‌ డైరెక్టర్‌ రాఘవ లారెన్స్ సంప్రదించాడు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కోలీవుడ్‌లో ప్రస్తుతం ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. తమిళ సినిమా ఇండస్ట్రీ వర్గాల వారు వీరిద్దరి కాంబోలో మూవీ ఉంటుందని బలంగా చెబుతున్నారు.

కాంచన 4 సినిమా కోసం రష్మిక మందన్న..

ప్రస్తుతం రాఘవ లారెన్స్‌ కాంచన 4 సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు వచ్చిన కాంచన ప్రాంచైజీ సినిమాలకు పాన్ ఇండియా రేంజ్‌లో మంచి హిట్ టాక్‌ వచ్చింది. అందుకే ఈ సినిమాపై అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉంటాయి. ఇది తమిళ సినిమా అయినప్పటికీ తెలుగులో డైరెక్ట్‌ తెలుగు సినిమా స్థాయిలో విడుదల కావడం మనం చూడబోతున్నాం. అంతే కాకుండా ఇతర భాషల్లోనూ కాంచన 4 సినిమా భారీ రిలీజ్‌ కి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తూ ఉండగా, కీలక పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ నోరా ఫతేహీ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో కీలకమైన దెయ్యం పాత్రను రష్మిక మందన్నతో చేయిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేశారట. అందుకే లారెన్స్‌ చిన్న చిన్న మార్పులు చేసి రష్మిక వద్దకు వెళ్లాడని వార్తలు వస్తున్నాయి.

పూజా హెగ్డే, నోరా ఫతేహీ హీరోయిన్స్‌గా..

నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేసేందుకు రష్మిక ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అందుకే కాంచన 4 సినిమాలో ఈ శ్రీవల్లి ఉంటుంది అనే విశ్వాసం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు లారెన్స్‌ ఆమెను సంప్రదించాడా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. సోషల్‌ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కాంచన 4 లో దెయ్యంగా రష్మిక నటిస్తే ఖచ్చితంగా పాన్‌ ఇండియా రేంజ్‌లో రచ్చ రచ్చ అన్నట్లుగా కలెక్షన్స్ నమోదు కావడం ఖాయం. బాక్సాఫీస్ షేక్ కావాలంటే రష్మిక వంటి స్టార్‌ కాస్ట్‌ కాంచన 4 లో అవసరం అని లారెన్స్ కూడా భావిస్తున్నాడని, అందుకే ఆమెకు అత్యధిక పారితోషికం ఇచ్చి మరీ నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది ముందు ముందు తెలిసే అవకాశాలు ఉన్నాయి.

కాంచన 4 పై రాఘవ లారెన్స్‌ కాన్ఫిడెన్స్‌..

సూపర్‌ హిట్‌ ప్రాంచైజీ మూవీ అయిన కాంచన 4 లో ఈమె ఉంటే ఖచ్చితంగా మంచి బిజినెస్‌ క్రియేట్‌ కావడంతో పాటు, మంచి బజ్ క్రియేట్‌ అవుతుంది అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. ప్రస్తుతం రష్మిక మందన్నకు ఉన్న మార్కెట్‌ నేపథ్యంలో కాంచన 4 లో ఆమె నటిస్తే ఖచ్చితంగా అత్యధిక పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది. పైగా దెయ్యం పాత్రకు ఒప్పుకోవాలంటే అంతకు ముందు తీసుకున్న పారితోషికంతో పోల్చితే ఎక్కువగానే ఆమె డిమాండ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో కాంచన 4 ను ప్లాన్‌ చేస్తున్నారు కనుక ఆమె పారితోషికం వారికి సమస్య కాకపోవచ్చు. కానీ రష్మిక కు సినిమాలో స్కోప్ ఉందా, నిజంగానే లారెన్స్‌ ఆమెను సంప్రదించాడా అనే విషయాలపై చర్చ జరుగుతోంది. రష్మికను ఇప్పటికే చాలా మంది సోషల్‌ మీడియాలో ఈ విషయమై తెగ సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎటువైపు నుంచి క్లారిటీ రాలేదు.