నేషనల్ క్రష్ ఇలా కండీషన్లు పెడితే ఎలా?
దీంతో దర్శక, నిర్మాతలంతా మరో ఐటం భామ దొరికేసిందని సంబరపడ్డారు. రష్మికను హీరోయిన్ గా తీసుకుంటే ఐటం భామగాను కన్విన్స్ చేయోచ్చు అన్న ధీమాలో ఉన్నారు.
By: Srikanth Kontham | 26 Jan 2026 9:45 AM ISTఒకప్పుడు ఐటం పాటల కోసం ప్రత్యేకంగా కొంత మంది ప్రోఫెషనల్ డాన్సర్స్ ఉండేవారు. దర్శకులు వాళ్లను మాత్రమే ఆ పాట్లలో భాగం చేసేవారు. వారు పెర్పార్మెన్స్ చేస్తేనే ఆ పాట సంచలనమయ్యేది. కానీ కొంత కాలంగా ట్రెండ్ మారిన సంగతి తెలిసిందే. అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన వాళ్లే ఐటం భామలగానూ మారిపో తున్నారు. హీరోయిన్ పారితోషికంతో పాటు స్పెషల్ సాంగ్ పారితోషికం ఒకే సినిమాతో అందుకుంటున్నారు. దీంతో పాటు హీరోయిన్లు కూడా ఇతర స్టార్స్ చిత్రాల్లో ఐటం ఛాన్సులు వస్తే కాదనకుండా పని చేస్తున్నారు.
నటిగా కంటే ఐటం పాటకు రెట్టింపు పారితోషికం అందుకుంటున్నారు. ఇప్పటికే సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా, పూజాహెగ్డే, శ్రీలీల లాంటి వారు అలా పని చేసిన వారే. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా బాలీవుడ్ డెబ్యూ `గుడ్ బై` చిత్రంలో నటిగా మెప్పించి ఐటం భామగాను అలరించింది. ఇటీవలే రిలీజ్ అయిన `థామా` సినిమాలో కూడా అలాగే మెప్పించింది. నటనతో పాటు స్పెషల్ సాంగ్ లోనూ కుర్రాళ్లను కవ్వించి మరింత దగ్గరైంది.
దీంతో దర్శక, నిర్మాతలంతా మరో ఐటం భామ దొరికేసిందని సంబరపడ్డారు. రష్మికను హీరోయిన్ గా తీసుకుంటే ఐటం భామగాను కన్విన్స్ చేయోచ్చు అన్న ధీమాలో ఉన్నారు. అలాంటి వాళ్లు అందరికీ రష్మిక షాక్ ఇచ్చింది. నటిగా, ఐటం భామగా కేవలం ఓ ఇద్దరు దర్శకుల చిత్రాల్లో మాత్రమే పెర్పార్మెన్స్ చేస్తానంది. ఆ ఇద్దరు దర్శకుల పేర్లు ఇప్పుడే చెప్పలేనని...సమయం వచ్చినప్పుడు తానే స్వయంగా రివీల్ చేస్తానంది. దీంతో రష్మిక ఐటం సాంగ్స్ విషయంలో సెలక్టివ్ గా ఉంటుందని తెలుస్తోంది. కానీ ఇలా ఇద్దరు దర్శకులకే పరిమితమైతే మిగతా దర్శకులు ఫీలైపోయారు.
ప్రత్యేకించి టాలీవుడ్ డైరెక్టర్లు చాలా మంది రష్మిక పై చాలా ఆశలు పెట్టుకున్నారు. రష్మికతో రకరకాల ప్రయోగాలు చేయించాలని సిద్ద పడుతున్నారు. అమ్మడి పాన్ ఇండియా క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకోవాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. రష్మిక నటి కం మంచి డాన్సర్ కావడంతోనే ఆమెతో లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేయడానికి కూడా దర్శకులు సిద్ద పడుతున్నారు. కానీ తాజాగా రష్మిక కండీషన్ తెలిస్తే మాత్రం వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో `మైసా` అనే లేడీ ఓరియేంటెడ్ చిత్రంలో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ 14వ చిత్రంలోనే హీరోయిన్ గా ఎంపికైంది. బాలీవుడ్ లో `కాక్ టెయిల్ 2`లోనూ నటిస్తోంది.
