నేషనల్ క్రష్ ఛాన్స్ తీసుకునే ఇద్దరిలో ఒకడితిడేనా!
స్టార్ హీరోయిన్లే ఐటం భామలగా రాణిస్తోన్న వేళ నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీటెక్కించే ఐటం భామతో ఎప్పుడు ఊపేస్తుందా? అని అభిమానులంతా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు
By: Srikanth Kontham | 29 Jan 2026 4:00 AM ISTస్టార్ హీరోయిన్లే ఐటం భామలగా రాణిస్తోన్న వేళ నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీటెక్కించే ఐటం భామతో ఎప్పుడు ఊపేస్తుందా? అని అభిమానులంతా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. `పుష్ప` సినిమాలో బోల్డ్ అప్పిరియన్స్ తో ఆకట్టుకున్నప్పటికీ అవి స్పెషల్ ఐటం సాంగ్ క్యాటగిరీ కిందకు రాలేదు. అలాగే బాలీవుడ్ డెబ్యూ `గుడ్ బై` చిత్రంలో నటిగా మెప్పించి ఐటం భామగాను అలరించింది. ఇటీవలే రిలీజ్ అయిన `థామా` సినిమాలో కూడా అలాగే మెప్పించింది. నటనతో పాటు స్పెషల్ సాంగ్ లోనూ కుర్రాళ్లను కవ్వించి మరింత దగ్గరైంది.
ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఐటం పాటలోనే ఎప్పుడు నటిస్తుంది? అనే చర్చ జరుగుతోన్న వేళ! అమ్మడు ఓ ఇద్దరు దర్శకుల చిత్రాల్లో మాత్రం కచ్చితంగా ఐటం పాటలో నటిస్తానంటూ ప్రామిస్ చేసింది. కానీ ఆ ఇద్దరి పేర్లు మాత్రం రివీల్ చేయలేదు. దీంతో వారిద్దరు ఎవరు? అంటూ నెట్టింట చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో అందులో ఓ డైరెక్టర్ హిట్ మెషిన్ అనీల్ రావిపూడి అంటూ లీక్ అయింది. రష్మికను అనీల్ రావిపూడి ఐటం పాట కసం అడిగితే కాదంటుందా? అతడు ఏ నటిని అయినా కన్విన్స్ చేయగలడు కాబట్టి ఇద్దరిలో ఒకరు అనీల్ కచ్చితంగా అవుతాడని గెస్ చేస్తున్నారు.
ఇప్పటికే అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన `సరిలేరు నీకెవ్వరు`లో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఛాన్స్ అనీల్ కారణంగానే రష్మికకు దక్కింది. టాలీవుడ్ లో రష్మిక హీరోయిన్ గా అప్పుడప్పుడే ఎదుగుతోంది. `గీత గోవిందం` లాంటి చిత్రం పెద్ద విజయం సాధించినా స్టార్ హీరోలకు ప్రమోట్ కాలేదు. సరిగ్గా అదే సమయంలో అనీల్ రావిపూడి ఆమెలో నటిని, కామెడీ టైమింగ్ ని గుర్తించి `సరిలేరు నీకెవ్వరు`లో ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.
ఈ విజయంతో స్టార్ హీరోలకు ప్రమోట్ అయింది. అలాగని యంగ్ హీరోలను లైట్ తీసుకోలేదు. ఓ వైపు వారితో పని చేస్తూనే? సీనియర్ స్టార్స్ తోనే ఛాన్స్ లు అందుకుంది. అలా రష్మిక కెరీర్ లో అనీల్ ప్రత్యేకమే. మరో డైరెక్టర్ ఎవరై ఉంటారు? అంటే రష్మికను టాలీవుడ్ లో పరిచయం చేసింది వెంకీ కుడుమల. నాగశౌర్య హీరోగా నటించిన `ఛలో` సినిమాతోనే అమ్మడు ఎంట్రీ ఇచ్చింది. ఇదే సినిమా దర్శకుడిగా వెంకీకి తొలి చిత్రం. అలా మొదటి చిత్రంతో నే వెంకీ-రష్మికలు టాలీవుడ్ కి గ్రాండ్ గా సక్సెస్ తో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఇద్దరు ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.
