కొరియన్ డ్రామాల్లో రష్మిక..వాటికి మాత్రం నో!
కన్నడ నుంచి నేషనల్ క్రష్ అయింది రష్మికా మందన్నా. టాలీవుడ్, బాలీవుడ్ లో అమ్మడి సక్సస్ ల గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 10 Nov 2025 2:05 PM ISTకన్నడ నుంచి నేషనల్ క్రష్ అయింది రష్మికా మందన్నా. టాలీవుడ్, బాలీవుడ్ లో అమ్మడి సక్సస్ ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రెండు భాషల్ని రష్మిక దున్నేస్తుంది. బాలీవుడ్ లో స్టార్ లీగ్ కి అతి సమీపంలో ఉంది. మరో రెండు బ్లాక్ బస్టర్లు పడ్డాయంటే? స్టార్ లీగ్ లాంఛనమే. అయితే అమ్మడు ఇంత బిజీగా ఉన్నా? కొరియన్ భాషపై సైతం అప్పుడే కన్నేసినట్లు కనిపిస్తుంది. కొరియన్ పై ముందొస్తు ప్రణాళిక తానెప్పుడో సిద్దం చేసి పెట్టుకుందని తాజాగా వెలుగులోకి వచ్చింది. కొరియన్ భాషలో నటించే అవకాశం వస్తే వెళ్లడానికి తాను సిద్దంగా ఉన్నట్లు వెల్లడించింది.
కండీషన్లు మాత్రం అప్లై:
కె-డ్రామాలంటే తనకు ఎంతో ఆసక్తిగా చెప్పుకొచ్చింది. వాటిలో నటించడం ఓ థ్రిల్లింగ్ గా భావిస్తానంది. లాక్ డౌన్ సమయంలో కొరియన్ సినిమాలు ఎక్కువగా చూసినట్లు తెలిపింది. అక్కడ నటీనటుల పనితనం ఎలా ఉంటుంది? ఎలాంటి కథలు తెరెక్కిస్తున్నారు? అక్కడ పని విధానం ఎలా ఉంటుంది? వంటి విషయాలు తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే కొరియన్ సినిమాలపై తనకెంత ఇష్టం ఉన్నా? కండీషన్లు మాత్రం అప్లై అంటుంది. అన్ని రకాల కథల్లో తాను నటించలేనని..తాను ఏ పాత్ర పోషించినా? అది హుందాగా మాత్రమే ఉండాలంది. రష్మిక మాటల్ని బట్టి కొరియన్ సినిమాల్లో సెలక్టివ్ గా ఉంటుందన్నది స్పష్టమవుతుంది.
కొరియాలో పద్దతైన పాత్రలా?
కొరియన్ సినిమాలంటే? హద్దులు లేని సన్నివేశాలుంటాయి. రొమాంటిక్ సన్నివేశాలు..బెడ్ రూమ్ సన్నివేశాల్లో ఎలాంటి హద్దులు ఉండవు. ఎలాంటి పాత్రలోనైనా వీలైనంత రియాల్టీ చూపించడం అక్కడ దర్శకుల ప్రత్యేకత. అందుకు తగ్గట్టే నటీనటులు పని చేస్తారు. అలాంటి సన్నివేశాలకు మాత్రం రష్మిక నో చెప్పేలా ఉందని ఆమె మాటల్ని బట్టి తెలుస్తోంది. పద్దతైన పాత్రల్లోనే నటించడానికి సిద్దంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఇదంతా ఈజీ కాదు. పాత్రకు తగ్గట్టు నటి మౌల్డ్ అవ్వకపోతే అవకాశాలు కష్టం. చిన్న చిన్న పాత్రలతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.
వారి ప్రయాణానికి భిన్నంగా:
మరి రష్మిక ఫ్యాషన్ గుర్తించి అవకాశాలిచ్చే కొరియన్ మేకర్స్ ఎవరుంటారో చూడాలి. కొరియన్ సినిమాలు చేసిన భారతీయ నటీనటులు కూడా పెద్దగా ఎవరూ లేరు. బాలీవుడ్ భామలు ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొణే, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా అలియా భట్ లాంటి భామలంతా హాలీవుడ్ లోనే పని చేసారు. ఇతర భాషల్లోనూ వారు అవకాశాల కోసం ప్రయత్నించలేదు. ఈ నేపథ్యంలో రష్మిక వారి ప్రయాణాన్నికి భిన్నంగా కొరియన్ పై ఆసక్తి చూపించడం ఇంట్రెస్టింగ్.
