Begin typing your search above and press return to search.

అతనితో విజయ, రష్మిక.. హ్యాపీగా ఇష్టమైంది తింటూ..!

విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న.. గత కొన్ని రోజులగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

By:  Priya Chowdhary Nuthalapti   |   7 Jan 2026 9:17 AM IST
అతనితో విజయ, రష్మిక.. హ్యాపీగా ఇష్టమైంది తింటూ..!
X

విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న.. గత కొన్ని రోజులగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం.. రోమ్ వెళ్లిన ఈ జంట ట్రిప్‌నే ఇప్పుడు అభిమానులు ఎక్కువగా గమనిస్తున్నారు. రోమ్ నుంచి వారు షేర్ చేసిన ఫోటోలు.. చూసి నెటిజన్లు తెగ ఆనంద పడిపోతున్నారు.





విజయ.. రష్మిక కలిసి ఒకే ఫోటోలో కనిపించకపోయినా, వేరువేరుగా షేర్ చేసిన ఫోటోలు మాత్రం ఒకే లొకేషన్‌లో తీసినవి అని అందరికీ అర్థమైన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ వెకేషన్ నుంచి వస్తూ..ఒకేసారి ఎయిర్ పోర్ట్ లో కూడా కనిపించారు. రోమ్‌లోని ప్రసిద్ధ ప్రదేశాలు.. ఇద్దరూ కలిసి వెకేషన్ ఎంజాయ్ చేశారని అభిమానులు భావిస్తున్నారు. మొదట షేర్ చేసిన ఫోటోలే కాదు.. తాజాగా వచ్చిన ఫోటోలు కూడా ఇవే తెలుపుతున్నాయి.





నిన్న రాత్రి.. విజయ్ షేర్ చేసిన ఫోటోలో కనిపించిన ఒక వ్యక్తి, రష్మిక ఫోటోలో కూడా కనిపించాడు. ఈ కామన్ పాయింట్ చూసిన అభిమానులు వెంటనే గుర్తించారు. “ఇద్దరూ కలిసి ఉన్నారు” అని సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి.





ఇదే సమయంలో విజయ్ దేవరకొండ షేర్ చేసిన మరో ఫోటో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో విజయ్ క్రీమ్ బన్ పట్టుకుని “చీర్స్” చెబుతూ కనిపించాడు. ఆయన పక్కన ఉన్న వ్యక్తి చేతి భాగం మాత్రమే కనిపించింది. ఆ చెయ్యికి ఉన్న డ్రెస్ కలర్..డిజైన్ రష్మిక షేర్ చేసిన ఫోటోలోని డ్రెస్‌తో అచ్చుగానే మ్యాచ్ అవుతోంది. దీంతో అది రష్మికేనని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.





ఈ అన్ని విషయాలు చూసిన అభిమానులు సోషల్ మీడియాలో వరుసగా కామెంట్లు పెడుతున్నారు. ఒకే లొకేషన్, ఒకే స్టైల్, ఒకే వ్యక్తులు కనిపించడం వల్ల ఈ రోమ్ వెకేషన్ ఇద్దరికీ చాలా స్పెషల్‌గా ఉందని అంటున్నారు. ఫైనల్ గా విజయ్–రష్మిక రోమ్ వెకేషన్.. బాగా ఎంజాయ్ చేశారు.. అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఇక మిగిలింది పెళ్లి గురించి అధికారిక ప్రకటన మాత్రమే అని..అది కూడా త్వరలోనే రావచ్చని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.