కెరీర్ పీక్‌లో పెళ్లి.. స్టార్ హీరోయిన్లకు అసలు ఛాలెంజ్ ఇక్కడే!
రష్మిక మందన్న తాజా ఎక్స్‌పీరియెన్స్ కూడా ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 3 Sept 2026 4:00 PM ISTవెండితెరపై మెరిసే గ్లామర్, వరుస సక్సెస్‌లు, భారీ ప్రాజెక్టులు చూస్తే స్టార్ హీరోయిన్ల జీవితం ఎంత రంగులమయంగా ఉంటుందో అనిపిస్తుంది. కానీ కెమెరా వెనక వారి ప్రపంచం మాత్రం అనుకున్నంత ఈజీగా ఉండదు. ముఖ్యంగా కెరీర్ పీక్‌లో ఉన్న టైమ్ లో పర్సనల్ లైఫ్ లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం అనేది స్టార్ హీరోయిన్లకు మరో పెద్ద సవాలుగా మారుతోంది. రష్మిక మందన్న తాజా ఎక్స్‌పీరియెన్స్ కూడా ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.
ఒకవైపు వరుస సినిమాలు, మరోవైపు కొత్త దాంపత్య జీవితం.. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడం సాధారణ విషయం కాదు. స్టార్‌డమ్ పెరిగే కొద్దీ షూటింగ్ షెడ్యూల్స్, జర్నీలు, ప్రమోషన్లు, కమిట్‌మెంట్లు పెరుగుతాయి. పర్సనల్ లైఫ్ కు టైమ్ కేటాయించడం కూడా కష్టమవుతుంది. కెరీర్‌లో ఒక్క అవకాశం కూడా వదులుకోకూడదనే ఒత్తిడి ఒకవైపు ఉంటే, ఫ్యామిలీ కోసం టైమ్ కేటాయించాలనే బాధ్యత మరోవైపు ఉంటుంది.
ఇవన్నీ చూసుకుంటే హీరోయిన్ జీవితం అంటే కేవలం మేకప్, కాస్ట్యూమ్స్, గ్లామర్ మాత్రమే కాదనే విషయం కూడా బయటపడుతోంది. ఆడియన్స్ కేవలం స్క్రీన్ పై కనిపించే కొన్ని గంటల ఎంటర్టైన్‌మెంట్ ను మాత్రమే చూస్తారు. కానీ ఆ క్యారెక్టర్ కోసం నటీనటులు చేసే శారీరక శ్రమ, గంటల తరబడి కొనసాగే షూటింగ్‌లు, గాయాలు, నొప్పి, మానసిక ఒత్తిడి మాత్రం చాలా సందర్భాల్లో కనిపించవు.
రష్మిక షూటింగ్ టైమ్ లో ఎదుర్కొన్న గాయం ఈ విషయాన్ని స్పష్టంగా చూపిస్తోంది. నొప్పిని భరిస్తూనే వర్క్ ను కంటిన్యూ చేయడం నుంచి, చివరకు రెస్ట్ తీసుకోవాల్సిన సిట్యుయేషన్ వరకు వెళ్లడం స్టార్ హీరోయిన్లపై ఉండే ప్రొఫెషనల్ ప్రెజర్ కు ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది. కెరీర్ వేగంగా దూసుకెళ్తున్న టైమ్ లో చిన్న బ్రేక్ కూడా పెద్ద డెసిషన్ గా మారే పరిస్థితి ఉంటుంది.
అయితే ఇలాంటి అనుకోని షూటింగ్ బ్రేకులే కొన్నిసార్లు లైఫ్ లో కోల్పోతున్న విషయాలను గుర్తు చేస్తాయి. కెరీర్ కోసం నిరంతరం పరుగులు తీస్తున్నప్పుడు వ్యక్తిగత సంబంధాలు, ఫ్యామిలీ, రెస్ట్ వంటి అంశాలు వెనక్కి వెళ్లిపోతాయి. అందుకే స్టార్ జీవితంలో అసలు ఛాలెంజ్ సక్సెస్ సాధించడం మాత్రమే కాదు.. కెరీర్‌ను కంటిన్యూ చేస్తూ, పర్సనల్ లైఫ్ ను కూడా సంతోషంగా నిలబెట్టుకోవడం కూడా. విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకున్న తర్వాత రష్మిక తన వరుస సినిమాల షూటింగులతో బిజీగా ఉండటం వల్ల ఇద్దరూ మూడు నెలల పాటూ దూరంగా ఉండాల్సి వచ్చిందని, ఫోన్ లోనే ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం తప్పించి, కలుసుకోలేకపోయామని రష్మిక చెప్పిన మాటలు స్టార్ హీరోయిన్ లైఫ్ లో ఉండే త్యాగాలను బయటపెట్టాయి.
