ఏడాదిలోపే 5 విభిన్న పాత్రలు..
సాధారణంగా హీరోయిన్స్ అంటే కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితమవుతారు అనే అపోహ ఒకప్పుడు ఉండేది.
By: Madhu Reddy | 8 Nov 2025 4:54 PM ISTసాధారణంగా హీరోయిన్స్ అంటే కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితమవుతారు అనే అపోహ ఒకప్పుడు ఉండేది. కానీ ఆ అపోహలను ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ బ్రేక్ చేస్తున్నారు. భిన్న విభిన్నమైన పాత్రలు పోషిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అవకాశం దొరకాలే కానీ తమ సత్తా ఏంటో చూపించడానికి సిద్ధం అంటున్నారు ఈ ముద్దుగుమ్మలు.. అలాంటి వారిలో ప్రథమ స్థానంలో నిలిచింది రష్మిక మందన్న.
రష్మిక అదృష్టం ఎలా ఉందంటే.. కేవలం 11 నెలల్లోనే ఏకంగా ఐదు విభిన్నమైన పాత్రలు పోషించి, ఆ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. రష్మిక పాత్రల విషయానికి వస్తే.. పుష్ప 2 సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఛావా సినిమాలో యేసు భాయ్ పాత్రతో రాజసం ఉట్టి పడేలా.. రాజ్యాన్ని కాపాడే పాత్రలో నటించి మెప్పించింది. కుబేర సినిమాలో సమీరా పాత్రలో బిచ్చగాడికి సహాయం చేసే ఒక అద్భుతమైన పాత్రతో ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ లాగా కాకుండా ఒక విభిన్నమైన పాత్ర పోషించింది రష్మిక.
ఆయుష్మాన్ ఖురానా హీరోగా వచ్చిన థామా సినిమాలో బేతాళ పాత్రతో భయపెట్టేసింది. ఇక ఇటీవల వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో ఇన్నోసెంట్ అమ్మాయి పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇలా ఒక్కో సినిమాతో ఒక్కో పాత్రను హైలైట్ చేస్తూ.. ఐదు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించింది రష్మిక. అంతేకాదు ఈ చిత్రాలన్నింటితో కూడా భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రస్తుతం మైసా , రెయిన్బో వంటి చిత్రాలలో నటిస్తోంది రష్మిక.
రష్మిక కెరియర్ విషయానికి వస్తే.. కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. కన్నడలోనే రెండు మూడు చిత్రాలు చేసింది. అంతేకాదు అక్కడే పలు యాడ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించిన రష్మిక.. తెలుగులో ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ , సరిలేరు నీకెవ్వరు ఇలా వరుస చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరిస్తోంది.
రష్మిక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేస్తోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు రహస్యంగా ఇద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే అప్పుడప్పుడు రష్మిక చేస్తున్న కామెంట్లు మాత్రం వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయిందనే విషయాన్ని పరోక్షంగా స్పష్టమయ్యేలా చేస్తోంది. ఇక అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఉదయ ప్యాలెస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి సిద్ధమైనట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఈ జంట పై రోజుకు ఒక వార్త వినిపిస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరూ అధికారికంగా స్పందించాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
