Begin typing your search above and press return to search.

29 ఏళ్ల రష్మిక ఫిట్నెస్ సీక్రెట్ అదేనా?

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఎట్టకేలకు తన ఫిట్నెస్ రహస్యాలను బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.." నేను ప్రతిరోజు ఉదయం లేవగానే లీటర్ నీళ్లు తాగుతాను.

By:  Madhu Reddy   |   20 Sept 2025 3:00 AM IST
29 ఏళ్ల రష్మిక ఫిట్నెస్ సీక్రెట్ అదేనా?
X

ఒకప్పుడు సినిమాలలో హీరోలు కానీ హీరోయిన్లు కానీ చాలా బొద్దుగా కనిపించేవారు. ముఖ్యంగా హీరోయిన్స్ బొద్దుగా ఉంటేనే అందంగా ఉంటారు అని దర్శక నిర్మాతలు కూడా వారికి సలహాలు ఇచ్చేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ఇటు అభిమానులలో కూడా అభిరుచులు పూర్తిగా మారిపోతున్నాయి.. అందులో భాగంగానే ఇప్పుడు జీరో ఫిగర్ మెయింటైన్ చేసే హీరోయిన్స్ కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అటు శారీరకంగా ఇటు మానసికంగా ఫిట్ గా ఉండాలని కోరుకుంటున్నారు కూడా.. అందులో భాగంగానే సెలబ్రిటీలు కూడా ఫిట్నెస్ గా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ఆహారం విషయంలోనే కాదు ఇటు ఆరోగ్యం విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

అందుకేనేమో 60 సంవత్సరాల వయసు వచ్చినా సరే ఇంకా 16 ఏళ్ల పడుచు పిల్లలా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు హీరోయిన్స్. ఇదిలా ఉండగా నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న తన ఫిట్నెస్ సీక్రెట్ గురించి బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈమె వయసు 29 సంవత్సరాలు.. ఈమెను చూస్తే ఇంకా 16 ఏమో అనకమానరు అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు. మరి రష్మిక మందన్న ఇంత యంగ్ గా కనిపించడానికి ఏం చేస్తుంది? ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఇలా పలు విషయాలు ఆమె స్వయంగా తెలియజేయడం గమనార్హం. మరి రష్మిక ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఎట్టకేలకు తన ఫిట్నెస్ రహస్యాలను బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.." నేను ప్రతిరోజు ఉదయం లేవగానే లీటర్ నీళ్లు తాగుతాను. ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటాను. నేను పూర్తిగా శాకాహారిగా మారిపోయిన తర్వాత మాంసాహారం తీసుకోవడం మానేశాను. అలాగే ఎక్కువగా వరి అన్నం కూడా తినను. టమాటో, బంగాళదుంప వంటి వాటికి దూరంగా ఉంటాను. వీటిని తినడం వల్ల నాకు అలర్జీ వస్తుంది. ఇక నిత్యం సాయంత్రం వేళ వ్యాయామం చేస్తాను" అంటూ రష్మిక తెలిపింది. మొత్తానికైతే రష్మిక ఫాలోవర్స్ ఈమె చెప్పిన ఫిట్నెస్ సీక్రెట్ తెలుసుకొని మేము కూడా ఇదే ఫాలో అవుతాం అంటూ కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం.

రష్మిక మందన్న విషయానికి వస్తే.. గత మూడేళ్లలో వరుసగా వరుస బ్లాక్ బాస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది ఇప్పటికే పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా, కుబేర అంటూ వరుస చిత్రాలతో సక్సెస్ జోరు మీద ఉంది ఈ ముద్దుగుమ్మ.. అందులో భాగంగానే మరొకవైపు విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఒక సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. అంతేకాదు అల్లు అర్జున్ 22వ మూవీలో కూడా అవకాశం అందుకుంది రష్మిక.. ఈ చిత్రాలతో పాటు థామా, కాంచన 4 వంటి హారర్ సినిమాలలో కూడా భాగమయ్యింది. అంతేకాదండోయ్ ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో అంటే చిత్రాలలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.