Begin typing your search above and press return to search.

కుటుంబంతో ర‌ష్మిక..ఎన్ని కోట్లు సంపాదించినా రాని సంతోషం!

అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సి రావడం బాధాక‌ర‌మే అయినా? అదే సమయంలో తనకు ఇష్టమైన కుటుంబంతో గడపడానికి సమయం దొరకడం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.

By:  Srikanth Kontham   |   6 Aug 2026 4:07 PM IST
కుటుంబంతో ర‌ష్మిక..ఎన్ని కోట్లు సంపాదించినా రాని సంతోషం!
X

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న‌ రష్మికా మందన్నా సినిమాలకు బ్రేక్ ఇచ్చి కుటుంబంతో సమయం గడుపుతున్నారు. నిరంతరం షూటింగ్‌లు, విమాన ప్రయాణాలు, బిజీ షెడ్యూళ్లతో తీరికలేకుండా గడిపే నేషనల్ క్రష్‌కు చిన్నపాటి గాయం .. అనారోగ్యం కారణంగా విరామం దొరికింది. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ భామకు ఆరోగ్య సమస్య ఒకరకంగా తన కుటుంబంతో కలిసి ఉండే సువర్ణావకాశాన్ని తెచ్చిపెట్టింది.

వ్యాపారాలు, కోట్ల రూపాయల పారితోషికాలు, స్టార్‌డమ్ ఎంత ఉన్నప్పటికీ కుటుంబంతో గడిపే ఆనందం ముందు అవేవీ సరిపోవని రష్మిక అనుభూతి చెందుతున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో కుటుంబ సభ్యులకు దూరం అయిన అమ్మ‌డు ఇప్పుడు పూర్తిగా ఇంటి పట్టునే ఉంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఎంత సంపాదించినా దొరకని మానసిక ప్రశాంతత కుటుంబంతో గడిపే క్షణాల వల్లే సాధ్యమవుతుందని ఈ విరామం ద్వారా ర‌ష్మిక‌ తెలుసుకుంటున్నారు.

షూటింగ్ సెట్స్, కెమెరాలు, లైట్ల హడావుడికి దూరంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో గడుపుతున్న క్షణాలు తనకు ఎంతో ఊరటనిస్తున్నాయని సన్నిహితులు చెబుతున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అమ్మ చేతి వంటలను ఆస్వాదిస్తూ ప్రియమైన వాళ్లతో నవ్వుతూ గడుపుతున్న రోజులు ర‌ష్మిక‌కు కోట్ల విలువైన సంపదలా కనిపిస్తున్నాయి. నిత్యం ఒత్తిడితో కూడుకున్న సినీ జీవితానికి ఇది అద్భుతమైన విరామమని చెప్ప‌క‌నే చెబుతుంది.

అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సి రావడం బాధాక‌ర‌మే అయినా? అదే సమయంలో తనకు ఇష్టమైన కుటుంబంతో గడపడానికి సమయం దొరకడం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎక్కడా ఆగకుండా వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న రష్మికకు ఈ విశ్రాంతి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో అవసరమైంది. ఆరోగ్యాన్ని మించిన సంపద లేదనే సత్యాన్ని ఈ సంఘటన మరోసారి నిరూపిస్తుంది.

చిన్న విరామం ద్వారా రష్మిక తనలోని సృజనాత్మకతను పునరుద్ధరించుకోవడంతో పాటు, అప్ క‌మింగ్ ప్రాజెక్ట్‌ల కోసం కొత్త శక్తిని కూడగట్టుకుంటున్నారు. సినిమా పరిశ్రమలో ఎంత‌టి ఉన్నత స్థానంలో ఉన్నా? వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఈ అనుభవం ఆమెకు మరింత స్పష్టం చేస్తుంది. అభిమానులు సైతం తమ అభిమాన నటి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూనే.. కుటుంబంతో ఆనందంగా గడుపుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం దొరికిన ఈ ప్రశాంతమైన సమయం ర‌ష్మిక‌కు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా జీవితంలోని అసలైన విలువలను మరోసారి గుర్తు చేస్తుంది. విరామం ముగిసిన తర్వాత ర‌ష్మిక మరింత ఉత్సాహంతో రెట్టింపు శక్తితో రంగుల ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. సంపాదన, కీర్తి కంటే ఆప్యాయతలు, అనుబంధాలే మనిషికి అసలైన బలాన్ని ఇస్తాయనేదానికి రష్మిక జీవితంలోని ఈ ఘట్టం చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది.