Begin typing your search above and press return to search.

రష్మికకు ఫేస్ ట్రీట్‌ మెంట్‌ జరిగిందా? ఏమైంది?

అయితే కొద్దిరోజులుగా సినిమాలతోపాటు తన వ్యక్తిగత విషయాలతో తరచుగా అమ్మడు వార్తల్లో నిలుస్తున్నారని చెప్పాలి.

By:  M Prashanth   |   27 Oct 2025 9:00 PM IST
రష్మికకు ఫేస్ ట్రీట్‌ మెంట్‌ జరిగిందా? ఏమైంది?
X

స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి అందరికీ తెలిసిందే. తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు.. తక్కువ సమయంలో ఎక్కువ ఫేమ్ సొంతం చేసుకుంది. కోట్లాది మంది ఫ్యాన్స్ ను దక్కించుకున్న ఆమె.. గీత గోవిందం, పుష్ప సిరీస్ చిత్రాలతోపాటు అనేక సినిమాలతో అలరించిందని చెప్పడంలో ఎలాంటి డౌన్ అక్కర్లేదు.

అయితే కొద్దిరోజులుగా సినిమాలతోపాటు తన వ్యక్తిగత విషయాలతో తరచుగా అమ్మడు వార్తల్లో నిలుస్తున్నారని చెప్పాలి. తాజాగా మరోసారి హాట్ టాపిక్ గా మారారు. రీసెంట్ గా ఫేస్ సర్జరీ చేయించుకున్నారు. ఆ విషయాన్ని ఆమెనే తెలిపారు. దీంతో ఆ మ్యాటర్ చర్చనీయాంశంగా మారింది. అనేక మంది నెటిజన్లు, అభిమానులు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే?

సాధారణంగా సెలబ్రిటీలు ఎయిర్‌ పోర్ట్‌ లో ఎప్పటికప్పుడు కనిపిస్తుంటారు. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్ల కోసం కొద్దిసేపు మాస్క్‌ తీసి ఫోటోలకు పోజులు ఇస్తారు. రష్మిక కూడా ఎప్పుడూ అలానే చేస్తారు. కానీ రీసెంట్ గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ట్రైలర్ విడుదల వేడుకకు వచ్చిన రష్మిక.. హైదరాబాద్ ఎయిర్ పోర్టు లో కనిపించారు. అప్పుడు సింపుల్ బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో ఉన్నారు.

బ్లాక్‌ మాస్క్‌ తో కనిపించగా... అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లు, అభిమానులు అంతా మాస్క్ తీయమని కోరారు. ఒక్క ఫోటో ఇవ్వండి మేడమ్ అంటూ రిక్వెస్ట్ చేశారు. దీంతో రష్మిక నవ్వేశారు. ఆ తర్వాత మళ్ళీ అడగ్గానే.. ఫేస్ ట్రీట్‌ మెంట్‌ అయ్యింది గైస్‌, తీయలేనని చెప్పారు. ఇంకేముంది.. ఆ విషయం వైరల్ గా మారింది. నెట్టింట వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.

దీంతో రష్మికకు ఏమైందని అనేక మంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. లిప్ ఫిల్టర్ తీసుకున్నారేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏ ట్రీట్ మెంట్ చేయించుకుందో మరి అని అంటున్నారు. అలా రకరకాల ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. మరికొందరు రష్మిక రీసెంట్ ఫోటోలు, వీడియోల్లో ఆమె లుక్స్ ను కంపేర్ చేస్తున్నారు. చిన్న మార్పులు ఉన్నాయని అంటున్నారు.

అదే సమయంలో ఫ్యాన్స్ మాత్రం.. నాచురల్ గానే అమ్మడు అందంగా ఉందని, ఇంకా ట్రీట్ మెంట్ ఎందుకని క్వశ్చన్ చేస్తున్నారు. మామూలుగానే చక్కగా ఉంటుందని రాసుకొస్తున్నారు. అయితే ఇటీవల రష్మికకు విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి విదితమే. దీంతో పెళ్లికి ముందు లుక్ కోసం అలా చేసుకున్నారేమోనని అనుమానపడుతున్నారు.