స్టార్ కాకముందే రష్మికలో ఆ స్పార్క్!
సినిమాల్లోకి వచ్చాక స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఒక ఎత్తయితే.. అసలు ఆ టాలెంట్ ఎప్పటి నుంచో ఉందని ప్రూవ్ చేసే వీడియోలు బయటకు రావడం మరో ఎత్తు.
By: M Prashanth | 13 Sept 2026 10:24 PM ISTసినిమాల్లోకి వచ్చాక స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఒక ఎత్తయితే.. అసలు ఆ టాలెంట్ ఎప్పటి నుంచో ఉందని ప్రూవ్ చేసే వీడియోలు బయటకు రావడం మరో ఎత్తు. ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన్న విషయంలోనూ అదే జరుగుతోంది. కాలేజీ డేస్ లో ఆమె చేసిన త్రోబ్యాక్ డ్యాన్స్ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన అభిమానులు.. అప్పుడూ రష్మికలో అదే జోష్, అదే గ్రేస్ ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
సినిమాల్లో రష్మిక డ్యాన్స్ అంటే స్పెషల్ క్రేజ్ ఉంది. సాంగ్ ఏదైనా సరే.. స్టెప్పులతో పాటు ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కష్టమైన స్టెప్పులను కూడా చాలా ఈజీగా చేస్తున్నట్టుగా కనిపించడం ఆమెకు ప్లస్ పాయింట్. అందుకే రష్మిక సాంగ్స్ లోని చాలా స్టెప్పులు సోషల్ మీడియాలో రీల్స్ గా కూడా ట్రెండ్ అవుతుంటాయి.
అయితే ఆ క్రేజ్ అంతా సినిమాల్లోకి వచ్చిన తర్వాతే మొదలైందా అంటే.. ట్రెండింగ్ త్రో బ్యాక్ వీడియో చూస్తే అలా అనిపించదు. కాలేజీ స్టేజ్ పైనే ఎలాంటి బెరుకు లేకుండా రష్మిక డ్యాన్స్ చేయడం కనిపిస్తోంది. పెద్ద సినిమా సెట్ లేదు.. స్టార్ కొరియోగ్రాఫర్ లేరు.. చుట్టూ తన క్లాస్ మేట్స్, ప్రేక్షకులు మాత్రమే. అయినా స్టేజ్ పై ఆమె చూపించిన కాన్ఫిడెన్స్ మాత్రం స్టార్ హీరోయిన్ కాన్ఫిడెన్స్ లా ఉంది.
ఇక్కడే రష్మిక మందన్న స్పెషాలిటీ కనిపిస్తోంది. చాలామంది సినిమాల్లోకి వచ్చిన తర్వాత డ్యాన్స్ పై స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుంటారు. కానీ రష్మిక పాత వీడియోలు చూస్తే చిన్నప్పటి నుంచే డ్యాన్స్ పై ఆమెకు ఇంట్రెస్ట్ ఫుల్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. స్టెప్పుల్లో ఎనర్జీతో పాటు పాటకు తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కూడా అప్పుడే కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. అప్పటి రష్మికకు, ఇప్పుడు కనిపించే రష్మికకు పెద్దగా తేడా కనిపించకపోవడం. అప్పట్లో కాలేజీ స్టేజ్ పై ఉన్న అదే జోష్.. ఇప్పుడు భారీ సినిమా సె ట్స్‌లోనూ కనిపిస్తోంది. అప్పట్లో తన టాలెంట్ ను చూపించేందుకు చిన్న స్టేజ్ ఉంటే.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల పాటల్లో అదే టాలెంట్ కు భారీ స్టేజ్ దొరికింది.
అందుకే ఆ వీడియో కేవలం ఓ పాత మెమోరీగా కాకుండా.. రష్మికలోని డ్యాన్స్ టాలెంట్ ఎప్పటి నుంచో ఉందనడానికి ఓ ఎగ్జాంపుల్ గా అభిమానులు చూస్తున్నారు. అప్పటి వీడియోలో కనిపించిన ఆ స్పార్క్ నే రష్మిక ఇప్పటికీ కంటిన్యూ చేస్తుండడం విశేషం. స్టార్ హీరోయిన్ గా ఎదిగినా.. తనలోని ఆ నేచురల్ ఎనర్జీ, గ్రేస్ ను మాత్రం ఆమె ఛేంజ్ చేసుకోలేదనే చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇక ఇప్పుడు త్రో బ్యాక్ వీడియో చూసిన రష్మిక ఫ్యాన్స్.. అప్పుడే ఇంత టాలెంట్ ఉందా? అంటూ తెగ షేర్ చేస్తున్నారు.
