Begin typing your search above and press return to search.

సడన్ సర్ప్రైజ్.. ఓటీటీలోకి రాబోతున్న రష్మిక కొత్త మూవీ!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గత మూడు నాలుగు సంవత్సరాలుగా బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలను సొంతం చేసుకుంటూ.. వేలకోట్ల కలెక్షన్లు రాబడుతూ.. దూసుకుపోతోంది.

By:  Madhu Reddy   |   2 Aug 2026 2:41 PM IST
సడన్ సర్ప్రైజ్.. ఓటీటీలోకి రాబోతున్న రష్మిక కొత్త మూవీ!
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గత మూడు నాలుగు సంవత్సరాలుగా బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలను సొంతం చేసుకుంటూ.. వేలకోట్ల కలెక్షన్లు రాబడుతూ.. దూసుకుపోతోంది. ముఖ్యంగా ఎంతో మంది హీరోలకు, నిర్మాతలకు లక్కీ లేడీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఈమె నటించిన దాదాపు అన్ని సినిమాలు కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నాయి. అటు థియేటర్లలో సంచలనం సృష్టించిన ఆ చిత్రాలు ఇటు ఓటీటీలలో కూడా రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈమె భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. అందులో భాగంగానే ప్రాంతీయంగా చిత్రాలు చేస్తూ అలరిస్తోంది. అలా ఇటీవల బాలీవుడ్ లో ఒక సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక మందన్న.. ఆ సినిమాతో డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమయింది. ఆ చిత్రం ఏదో కాదు కాక్ టెయిల్ 2.

డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైన రష్మిక మందన్న కొత్త మూవీ..

రష్మిక మందన్న హీరోయిన్ గా, కృతి సనన్ ప్రధాన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ నటించిన చిత్రం కాక్ టెయిల్ 2. హోమి ఆడజానియా దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 19వ తేదీన థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది.

కాక్ టెయిల్ 2 స్ట్రీమింగ్ డేట్ లాక్..

ప్రముఖ ఓటీటీ దిగ్గజ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 14వ తేదీ నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఎలాగో ఆగస్టు 15 శనివారం, ఆగస్టు 16 ఆదివారం వీకెండ్స్ కావడంతో ఈ సినిమాకు మరింత వ్యూ రేటింగ్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

కాక్ టెయిల్ 2 మూవీ స్టోరీ..

కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్న) ఇద్దరు రొమాంటిక్ లివింగ్ రిలేషన్ లో ఉంటారు. యాలీ (కృతి సనన్) , దియా ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. అయితే ఒకసారి కునాల్, దియా ఫారిన్ వెకేషన్ కి వెళ్ళినప్పుడు.. యాలీతో కునాల్ కి పరిచయం ఏర్పడుతుంది.. అదే సమయంలో కునాల్ పై యాలీ క్రష్ పెంచుకోవడమే కాకుండా ఒకానొక సమయంలో అతడితో శారీరకంగా కూడా కలుస్తుంది. ఆ క్రమంలో కునాల్ , దియా పెళ్లి ఫిక్స్ అవుతుంది. అయినా కునాల్ పై పీకల్లోతు ప్రేమలో మునిగిపోతుంది యాలీ. కునాల్ పై ఉన్న ప్రేమ విషయాన్ని తమ మధ్య ఉన్న బంధాన్ని దియాతో పెళ్లికి ముందు తెలియజేస్తుంది యాలీ.

ఈ ప్రశ్నల సమాధానమే కాక్ టెయిల్2..

ఇక ఆ సమయంలో దియా రియాక్షన్ ఏంటి? కునాల్, దియా మధ్య రిలేషన్ లోకి యాలి ఎలా వచ్చింది? దియాతో డేటింగ్ చేస్తున్నప్పటికీ యాలీ ఎలా కునాల్ కు దగ్గర అయింది ?పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ కునాల్ పై ప్రేమను యాలి ఎలా పెంచుకుంది? కునాల్ తో మ్యారేజ్ బ్రేక్ చేస్తానని యాలీ చెబితే దియా రియాక్షన్ ఏంటి ? చివరికి కునాల్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఇలా తదితర ప్రశ్నలకు సమాధానమే కాక్ టెయిల్2.