లండన్ వీధుల్లో రష్మిక.. ఈ లుక్ చూశారా..
'నేషనల్ క్రష్' రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో టాప్ లెవెల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 12 Jan 2026 10:57 PM IST'నేషనల్ క్రష్' రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో టాప్ లెవెల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నా, సోషల్ మీడియాలో మాత్రం తన అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడం ఆమెకు అలవాటు. లేటెస్ట్ గా ఈ బ్యూటీ లండన్ వీధుల్లో సందడి చేస్తూ దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పని ఒత్తిడిని పక్కన పెట్టి ఇలా చిల్ అవుతూ, తన సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ లేటెస్ట్ ఫొటోల్లో రష్మిక గ్రే బ్లాక్ కలర్ స్ట్రైప్డ్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతున్నారు. నిలువు చారలు ఉన్న షర్ట్, దానికి మ్యాచింగ్‌గా అదే డిజైన్ ఉన్న లాంగ్ స్కర్ట్ ధరించి ఎంతో క్లాసీగా కనిపిస్తున్నారు. ఈ ఫార్మల్ టచ్ ఉన్న క్యాజువల్ లుక్‌లో ఆమెను చూస్తుంటే ఒక పర్ఫెక్ట్ 'బాస్ లేడీ' వైబ్స్ కనిపిస్తున్నాయి. లండన్ బ్రిడ్జ్, బిగ్ బెన్ బ్యాక్ డ్రాప్లో ఆమె నిల్చుని ఇచ్చిన ఫోజులు చాలా నేచురల్‌గా ఉన్నాయి.
"నగరాలు మారుతున్నా, వాతావరణం మారుతున్నా.. నా న్యూ ఇయర్ రెజల్యూషన్స్కు కట్టుబడి ఉన్నాను" అంటూ రష్మిక పెట్టిన క్యాప్షన్ ఆసక్తికరంగా ఉంది. ఆమె నవ్వులో ఆనందం, కళ్ళలో ప్రశాంతత చూస్తుంటే ఆమె ఈ సమయాన్ని ఎంతలా ఆస్వాదిస్తున్నారో అర్థమవుతోంది. సింప్లిసిటీలోనే అసలైన నిలకడ ఉంటుందని చెబుతూ, తన లైఫ్ స్టైల్ ఫిలాసఫీని ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.
ఫ్యాషన్ పరంగా రష్మిక ఎప్పుడూ కొత్తగానే ఆకట్టుకుంటు ఉంటారు. ఈ లుక్‌లో కూడా హెవీ మేకప్ జోలికి వెళ్లకుండా, జుట్టును గాలికి వదిలేసి చాలా సింపుల్‌గా కనిపించారు. డ్రెస్‌కు తగ్గట్టుగా నలుపు రంగు పాయింటెడ్ హీల్స్ ధరించి తన స్టైలింగ్‌ను పర్ఫెక్ట్గా కంప్లీట్ చేశారు. ఎలాంటి భారీ ఆభరణాలు లేకపోయినా, ఆమె గ్లోయింగ్ స్కిన్, ఆ క్యూట్ చిరునవ్వే ఆమెకు పెద్ద ఆభరణంలా మారాయి. కెరీర్ పరంగా 'పుష్ప 2'తో గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక, ఇప్పుడు చేతి నిండా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. షూటింగ్ గ్యాప్‌లో ఇలా ట్రావెల్ చేస్తూ, అక్కడి విశేషాలను పంచుకుంటూ ఉంటారు.
