2025..వృత్తి..వ్యక్తిగతంగా రష్మికకు సంథింగ్ స్పెషల్!
వాటిలో ఒక సినిమా మినహా దాదాపు అన్ని సినిమాలు మంచి విజయం సాధించినవే. ఇటీవలే `ది గర్ల్ ప్రెండ్` తో విమర్శకుల ప్రశంసంలందుకున్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 12 Nov 2025 11:00 AM ISTనేషనల్ క్రష్ రష్మికా మందన్నా వృత్తిగత జీవితం ఎలా ఉందన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు పట్టిందల్లా బంగారమే అవుతుంది. వరుస విజయాలతో అంతకంతకు తన రేంజ్ ను రెట్టింపు చేసుకుంటుంది. టాలీవుడ్, బాలీవుడ్ అంటూ రెండు భాషల్లోనూ బిజీగా ఉంది. ఎక్కడ తగ్గాలో తగ్గుతుంది..ఎక్కడ ఎక్కాలో ఎక్కుతుంది. గడిచిన ఈ ఐదేళ్ల కాలంలో కెరీర్ జర్నీ విషయంలో రష్మికలా ఎవరూ ప్లాన్ చేసుకుని ఉండరు. అయితే ఇలా అందరికీ కలిసి రాదు. ఆ విషయంలో రష్మిక ఎంతో లక్కీ. ఈ ఏడాది ఇప్పటికే ఐదు సినిమాలతో ప్రేక్షకుల మధ్యలో ఉంది.
బాధ్యతగల నటిగానూ ప్రయాణం:
వాటిలో ఒక సినిమా మినహా దాదాపు అన్ని సినిమాలు మంచి విజయం సాధించినవే. ఇటీవలే `ది గర్ల్ ప్రెండ్` తో విమర్శకుల ప్రశంసంలందుకున్న సంగతి తెలిసిందే. రష్మిక కెరీర్ లో ఇది ఓ గొప్ప చిత్రంగా నిలిచి పోతుందని టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందులో అమ్మడి అభినయం అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. కేవలం కమర్శియల్ యాస్పెక్ట్ లోనే కాకుండా సామాజిక బాధ్యతతోనూ రష్మిక వ్యవహరిస్తుందని ఇలాంటి సినిమాల ద్వారా ప్రూవ్ అవుతుంది. ఇదంతా వృత్తిగత జీవితం. మరి వ్యక్తిగతంగా రష్మిక ఎంత సంతోషంగా ఉందో? చెప్పాల్సిన పనిలేదు. రక్షిత్ శెట్టితో బ్రేకప్ తర్వాత ఎన్నో విమర్శలకు గురైంది.
రష్మిక జీవితంలో కొత్త మనిషి:
సొంత పరిశ్రమ నుంచే ఎన్నో సవాళ్లు ఎదుర్కుంది. వ్యక్తిగత దూషణలకు గురైంది. అయినా ఏనాడు సహనం కోల్పోలేదు. తాను ఎం చెప్పినా అంతా సున్నితంగానే వ్యవహరించింది. అయితే రష్మిక జీవితంలోకి విజయ్ దేవరకొండ ఎంటర్ అయిన తర్వాత వ్యక్తిగత జీవితం మళ్లీ సంతోషమైంది. కొంత కాలంగా ఇద్దరి మధ్య సాగుతోన్న ప్రేమాయణానికి నిశ్చితార్దం ఇదే ఏడాది పుల్ స్టాప్ పెట్టారు. ఆ విషయం అధికారికం కాకపోయినా? విషయం మాత్రం బయటకు వచ్చేసింది. దీంతో రష్మిక గత బాధ బంధీలన్నింటినీ మర్చిపోయి కొత్త జీవితం ప్రారం భించింది.
ముగింపు వేళ రష్మిక సంతోషం:
ప్రస్తుతం రష్మిక ఎంతో సంతోషంగా ఉంది. ఓవైపు విజయాలు, మరోవైపు కొరుకున్న చెలికాడు పక్కనే ఉండటంతో సంతోషమంతా తనదే అన్నంతగా కనిపిస్తోంది. ఇవన్నీ కలసొచ్చిన ఏడాది ఏది? అంటే 2025 అని తప్పక మాట్లాడు కోవాలి. ఎందుకంటే అవన్నీ జరిగింది ఇదే ఏడాది. ఆ ఏడాది ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. మరో యాభై రోజుల్లో 2025 కి బైబై చెప్పి కొత్త ఏడాదిలోకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పబోతుంది. ఆ ముందు పాత జ్ఞాపకా లన్నింటినీ రష్మిక నెమర వేసుకోవడం తధ్యం. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో `కాక్ టెయిల్ 2`లో నటిస్తోంది. అలాగే తెలుగులో `మైసా` అనే లేడీ ఓరియేంటెడ్ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి.
