Begin typing your search above and press return to search.

ర‌ష్మిక సెకెండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండ‌బోతుంది?

నిండు నూరేళ్లు ఆ న‌వ‌దంప‌తుల జీవితం సంతోషంగా సాగిపోవాల‌ని ఆశీద్దాం. ఇక ర‌ష్మిక కెరీర్ లో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభ‌మైన‌ట్లే.

By:  Srikanth Kontham   |   5 March 2026 8:00 PM IST
ర‌ష్మిక సెకెండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండ‌బోతుంది?
X

మొత్తానికి నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా ఓ ఇంటిదైపోయింది. న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ప్రేమ వివాహం చేసుకుని ధాంప‌త్య జీవితంలోకి అడుగు పెట్టింది. తెలంగాణ ఇంట కోడ‌ల‌వుతాన‌ని ర‌ష్మిక ఏనాడు ఊహించి ఉండ‌దు. న‌ట జ‌ర్నీ లో భాగంగా ఇదంతా అనుకోకుండా జ‌రిగిన ప్ర‌క్రియ‌. ఏది ఏమైనా ప్రేమించిన చెలికాడుని వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించ‌డం గొప్ప విష‌యం. నిండు నూరేళ్లు ఆ న‌వ‌దంప‌తుల జీవితం సంతోషంగా సాగిపోవాల‌ని ఆశీద్దాం. ఇక ర‌ష్మిక కెరీర్ లో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభ‌మైన‌ట్లే.

ఇక‌పై త‌న సినీ ప్ర‌యాణాన్ని ఎంత కొత్త‌గా ప్లాన్ చేస్తుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రం. భ‌ర్త కూడా న‌టుడే కాబ‌ట్టి న‌టిగా ర‌ష్మికు ఎలాంటి కండీష‌న్లు పెట్ట‌డు అన్న‌ది అంతా భావిస్తున్న‌ది. స్వేచ్ఛ‌గా సినిమాలు చేసుకునే వెసులబాటు ర‌ష్మిక‌కు ఉంటుంది. అయితే పాత్ర‌ల ప‌రంగా ర‌ష్మిక ఎంత సెల‌క్టివ్ గా ఉంటుంది అన్న‌ది కీల‌కం. పెళ్లికి ముందు ర‌ష్మిక వెండి తెర‌పై ఎంతో బోల్డ్ గా క‌నిపించింది. గ్లామ‌ర్ పాత్ర‌ల ప‌రంగా ఏనాడు వెన‌క‌డుగు వేసింది లేదు. పూర్తిగా ద‌ర్శ‌కుల హీరోయిన్ గానే ప‌నిచేసింది. బాలీవుడ్ కి వెళ్లిన త‌ర్వాత అక్క‌డ సంస్కృతికి చాలా సుల‌భంగా అర్దం చేసుకుంది.

అక్క‌డ సెల‌బ్రిటీస్ లో మింగిల్ అవ్వ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం తీసుకోలేదు. త‌న‌దైన చ‌లాకీ త‌నంతో నార్త్ హీరోయిన్ల‌తో క‌లిసి పోయింది. అక్క‌డ న‌టించింది కొన్ని సినిమాలే అయినా? ప్ర‌త్యేక‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే బాలీవుడ్ లో ప్ర‌యాణం ఇప్పుడే మొద‌లైంది. అక్క‌డ తాను సాధించాల్సింది ఇంకా చాలానే ఉంది. న‌టిగా అంతిమంగా బాలీవుడ్ లోనే స్థిర‌ప‌డాలి అన్న‌ది అమ్మ‌డి డ్రీమ్. కానీ టాలీవుడ్ త‌ర‌హాలో బాలీవుడ్ లో జ‌ర్నీ అంత సుల‌భం కాదు. ఎలాంటి నిబంధ‌న‌లు లేకుండా ద‌ర్శ‌కుల హీరోయిన్ గా ప‌నిచేయ‌డం అన్న‌ది చిన్న టాస్క్ కాదు.

నార్త్ భామ‌లే అక్క‌డ క‌ల్చ‌ర్ ను త‌ట్టుకోలేక వెనుదిరిగిన వారెంతో మంది. ఇలాంటి ఎన్నో విష‌యాల్ని అక్క‌డ ఎదుర్కోవాల్సి ఉంటుంది. బెంగుళూరు నుంచి ముంబైకి వెళ్లి అగ్ర హీరోయిన్ల‌గా ఎదిగిన వారు ఐశ్వ‌ర్యారాయ్ త‌ర్వాత దీపికా ప‌దుకొణే మాత్ర‌మే. ఆ త‌ర్వాత స్థానంలో ర‌ష్మిక నిల‌వాలంటే ఎన్నో సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంటుంది. గ్లామ‌ర్ పాత్ర‌ల ప‌రంగా కండీష‌న్లు లేకుండా న‌టించాల్సి ఉంటుంది. ఇలాంటి వాటి విష‌యంలో భ‌ర్త‌, కుటుంబం మ‌ద్ద‌తు కూడా అంతే అవ‌స‌రం. అక్క‌డ ఏమాత్రం నెగివిటీ వ్య‌క్త‌మైనా? ర‌ష్మిక డ్రీమ్ అంత సుల‌భం కాద‌న్న‌ది గుర్తించాలి. ఐశ్వ‌ర్యారాయ్, దీపీకా ప‌దుకొణే బాలీవుడ్ సెల‌బ్రిటీల‌ను వివాహం చేసుక‌వోడంతో? వారికి పెద్ద‌గా ఇబ్బందులు ఎదుర‌వ్వ‌లేదు. వాళ్ల‌ను అర్దం చేసుకున్న భ‌ర్త‌ల దొర‌క‌డంతోనే సాధ్య‌మైంది. ఆ విష‌యంలో విజ‌య్ నుంచి ర‌ష్మిక‌కు ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంద‌న్న‌ది చూడాలి.