Begin typing your search above and press return to search.

ట్రోలర్స్ కి రష్మిక కౌంటర్.. ఇప్పుడైనా?

రష్మిక మందన్న.. కన్నడ ముద్దుగుమ్మ అయినప్పటికీ టాలీవుడ్ లో సత్తా చాటి నేడు పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతోంది.

By:  Madhu Reddy   |   3 Dec 2025 5:15 PM IST
ట్రోలర్స్ కి రష్మిక కౌంటర్.. ఇప్పుడైనా?
X

రష్మిక మందన్న.. కన్నడ ముద్దుగుమ్మ అయినప్పటికీ టాలీవుడ్ లో సత్తా చాటి నేడు పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతోంది. అది తక్కువ సమయంలోనే నాలుగు వేల కోట్లకు పైగా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టి.. స్టార్ హీరోలను సైతం ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఏ ఒక్క హీరోకి సాధ్యం కానీ అతి కష్టమైన రికార్డులను బ్రేక్ చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంది రష్మిక.. తన నటనతోనే కాదు అందంతో ఆకట్టుకుంటూ నేషనల్ క్రష్ గా పేరు సొంతం చేసుకుంది. ఇకపోతే ఒకవైపు సినిమాలు మరొకవైపు సోషల్ మీడియాలో బిజీబిజీగా గడిపేస్తున్న ఈమె.. తన ఫోటోలను మార్ఫింగ్ చేయడం పై ఎప్పటికప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు మరొకసారి ఏఐ దుర్వినియోగంపై ఒక సుదీర్ఘ నోటు పంచుకుంది. ఎక్స్ వేదికగా రష్మిక షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవ్వడమే కాకుండా ఏఐని దుర్వినియోగం చేస్తూ తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలిన వారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. అధునాతన టెక్నాలజీ రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీ మనిషికి ఉపయోగపడాలి కాని దుర్వినియోగం కాకూడదు. అయితే కొంతమంది ఈ ఏఐ రంగంలో అద్భుతాలు సృష్టిస్తుంటే మరికొంతమంది దీనిని తప్పు దోవలో ఉపయోగిస్తూ అటు సెలబ్రిటీలకు ఇటు సామాన్యులకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా స్పందించడమే కాకుండా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం లేదా కోర్టును ఆశ్రయించడం లాంటివి చేశారు. అయితే ఇప్పుడు తాజాగా దీనిపై రష్మిక స్పందించింది.

రష్మిక తన ఎక్స్ ఖాతా ద్వారా.."మహిళలను లక్ష్యంగా చేసుకొని ఏఐని ఉపయోగిస్తూ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తుండడం కొంతమంది వ్యక్తులలో నైతిక క్షీణతను సూచిస్తోంది. నిజానికి ఇంటర్నెట్ ప్రతిబింబం లాంటిది కాదని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా వక్రీకరించగలిగే కాన్వాస్ ఇది. గౌరవప్రదమైన మెరుగైన సమాజం కోసం మాత్రమే ఏఐ ను వినియోగిద్దాం. నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి బాధ్యతగా వ్యవహరిద్దాము. ఇక నిజాన్ని తయారు చేయగలిగినప్పుడే విచక్షణే మనకు గొప్ప రక్షణగా మారుతుంది" అంటూ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించే వారిని ఉద్దేశిస్తూ రష్మిక ఈ పోస్ట్ పెట్టింది.

ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఏఐ ను తప్పుదోవ పట్టిస్తూ వ్యక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిని.. మనుషుల్లాగా ప్రవర్తించని వారిని కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేసింది రష్మిక. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.