Begin typing your search above and press return to search.

ఈ తెలుగు హీరోయిన్ స్పీడే వేరు సుమీ!

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న `నేషనల్ క్రష్` రష్మిక మందన్న ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ దశను అనుభవిస్తోంది.

By:  Sivaji Kontham   |   5 Jun 2026 10:00 PM IST
ఈ తెలుగు హీరోయిన్ స్పీడే వేరు సుమీ!
X

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న `నేషనల్ క్రష్` రష్మిక మందన్న ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ దశను అనుభవిస్తోంది. ఈ బ్యూటీ నటించే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా.. సినిమా బడ్జెట్ పరంగా కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇటీవల విడుదలైన వ‌రుస సినిమాల‌ సమాచారం ప్రకారం.. 200 కోట్ల నుంచి 500 కోట్ల వ‌ర‌కూ ఉన్న భారీ బ‌డ్జెట్ చిత్రాల‌లో ఈ భామ న‌టించింది. రష్మిక నటిస్తున్న తాజా చిత్రం `కాక్‌టెయిల్ 2` కోసం నిర్మాతలు సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రష్మిక వరుసగా భారీ వ్యయంతో కూడిన చిత్రాలలో భాగస్వామి అవుతూ ఇండస్ట్రీలో తన రేంజ్‌ను పెంచుకుంటోంది.

రష్మిక నటించిన గత చిత్రాలను పరిశీలిస్తే.. ఈ ట్యాలెంటెడ్ న‌టి భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన `యానిమల్` చిత్రం సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయం రష్మికకు హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని క్రేజ్‌ను తీసుకువచ్చింది. కేవలం బాలీవుడ్ మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనూ అత్యంత భారీ వ్యయంతో రూపొందిన చిత్రాలలో ర‌ష్మిక‌ కథానాయికగా రాణిస్తోంది.

ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపుతున్న `పుష్ప: ది రైజ్`, `పుష్ప 2: ది రూల్` చిత్రాల బడ్జెట్ ఏకంగా రూ. 500 కోట్లుగా ఉంది. ఈ చిత్రాలలో `శ్రీవల్లి`గా రష్మిక మందన్న నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఇంతటి భారీ బడ్జెట్ చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషిస్తూ... భారీ విజయాలలో భాగమ‌వ్వ‌డం ర‌ష్మిక‌ కెరీర్‌కు ప్లస్ పాయింట్‌గా మారింది. నిజానికి అతి తక్కువ కాలంలోనే రూ. 500 కోట్ల ప్రాజెక్టులలో భాగం కావడం ఏ నటికైనా గర్వకారణమే.

తాజాగా `కాక్‌టెయిల్-2` సీక్వెల్ గురించి వస్తున్న వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రూ. 150 కోట్ల వ్యయం అవుతోందని సమాచారం. ముగ్గురు అగ్ర నటుల కలయికలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం భారీ సెట్లు, షూటింగ్ లోకేషన్ల పరంగా నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కూడా రష్మిక ఖాతాలో మరో హై-బడ్జెట్ హిట్ గా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తానికి రష్మిక మందన్న తన కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాలలో నటిస్తూ ఒక సరికొత్త రికార్డు వైపు దూసుకుపోతోంది. రూ. 200 కోట్ల నుండి రూ. 500 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాల వరకు ర‌ష్మిక‌ ప్రాధాన్యత పెరగడం నేష‌న‌ల్ క్ర‌ష్ బ్రాండ్ ఇమేజ్ ను.. త‌న‌ మార్కెట్ డిమాండ్‌ను సూచిస్తోంది. ఆస‌క్తిక‌రంగా కెరీర్ లో అత్యుత్త‌మ పారితోషికాన్ని కూడా కాక్ టైల్ 2 మూవీ కోసం ర‌ష్మిక అందుకుంటోంది. ఈ మూవీ కోసం త‌న‌కు ఏకంగా 15కోట్ల పారితోషికం అందుతోంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ర‌ష్మిక ప్ర‌స్తుతం కెరీర్ బెస్ట్ ఫేజ్ ని ఆస్వాధిస్తున్నాడు.