Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : 130 ఏళ్ల వేడుకలో రష్మిక షో

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న ఫ్యాషన్‌ ఐకాన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యాషన్‌ షోలకు, కొత్త ఫ్యాషన్‌ కార్యక్రమాలకు హాజరు అవుతూ రష్మిక కనిపిస్తూ ఉంటుంది.

By:  Ramesh Palla   |   30 Oct 2025 12:04 PM IST
పిక్‌టాక్‌ : 130 ఏళ్ల వేడుకలో రష్మిక షో
X

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న ఫ్యాషన్‌ ఐకాన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యాషన్‌ షోలకు, కొత్త ఫ్యాషన్‌ కార్యక్రమాలకు హాజరు అవుతూ రష్మిక కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు స్వరోవ్స్కీ కార్యక్రమంలో పాల్గొంది. లాస్‌ ఏంజిల్స్ లో స్వరోవ్స్కీ నిర్వహించిన మాస్టర్స్‌ ఆఫ్‌ లైఫ్‌ లో రష్మిక మెరిసింది. 130 ఏళ్ల అసాధారణ డిజైనర్‌ మోడల్స్‌ ను ఈ కార్యక్రమంలో సదరు సంస్థ ప్రదర్శించింది. ఎంతో మంది సినీ ప్రముఖులు, మోడల్స్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో మన నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రష్మిక ధరించిన ఔట్‌ ఫిట్‌, ఆమె ధరించిన ఆభరణాలు ఆకట్టుకున్నాయి. మోడల్‌ గా రష్మిక మరోసారి ఆకట్టుకుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తూ సోషల్‌ మీడియా ద్వారా ఈ ఫోటోలను షేర్‌ చేస్తూ వస్తున్నారు.




రష్మిక మందన్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఔట్‌ ఫిట్‌...

బ్లాక్‌ అండ్ వైట్‌ ఔట్‌ ఫిట్ ధరించిన రష్మిక మందన్న దానికి తగ్గట్లుగా నెక్‌ డైమండ్ చౌకర్ ను ధరించడం ద్వారా మరింత అందంగా కనిపిస్తుంది. ఆమె మేకోవర్‌ సైతం సింపుల్ అండ్ స్వీట్‌గా ఉండటంతో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. సాధారణంగానే రష్మిక మందన్న అందమైన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. ఈసారి అంతకు మించి అన్నట్లుగా అందమైన ఫోటోలతో అలరిస్తుంది. ఆకట్టుకునే అందంతో పాటు, రష్మిక మందన్న ట్రెండీ లుక్‌ మెప్పించే విధంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉండటం వల్లే పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌గా రష్మిక వెలుగు వెలుగుతోంది అంటూ సినీ విశ్లేషకులు సైతం సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. రష్మిక సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కావడం ద్వారా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంది.

ఛావా సినిమాతో బ్లాక్ బస్టర్‌ విజయం...

ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఇప్పటికే ఛావా, సికిందర్‌, కుబేరా, థామా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఛావా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలోని రష్మిక మందన్న పాత్రకు మంచి మార్కులు దక్కాయి. బాలీవుడ్‌లోనూ ఈమె క్రేజ్ మరింతగా పెరిగే విధంగా ఛావా సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. వరుస విజయాలతో ఏకంగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌కు జోడీగా నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావించారు. కానీ ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అయినా కూడా బాలీవుడ్‌లో రష్మిక మందన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సోషల్‌ మీడియాలోనూ ఆమెకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి, ఆమె స్టార్‌డం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ది గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమాతో రష్మిక...

ఇటీవల రష్మిక థామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో రూపొందిన థామా సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను భయపెట్టలేక పోయింది. అయితే రష్మిక పాత్రకు, ఆమె నటకు మంచి మార్కులు దక్కాయి. హర్రర్‌ సినిమాల్లోనూ రష్మిక నటించగలదు అని థామా సినిమా నిరూపించింది. ఇక మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీ ది గర్ల్‌ ఫ్రెండ్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రష్మిక మందన్న రెడీగా ఉంది. ఇదే ఏడాదిలో ఆ సినిమా కూడా రాబోతుంది. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ది గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్‌ కి పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కడంతో పాటు, మంచి పాత్రలో రష్మిక కనిపించబోతుంది అనే నమ్మకం, విశ్వాసం కలిగించింది. ఇవే కాకుండా ఇంకా చాలా సినిమాలను లైన్‌ లో పెట్టిన రష్మిక మందన్న వచ్చే ఏడాదిలోనూ మూడు నాలుగు సినిమాలతో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.