Begin typing your search above and press return to search.

కేవ‌లం 9ఏళ్ల‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా ర‌ష్మిక జ‌ర్నీ

కెరీర్ ప్రారంభించిన కేవ‌లం రెండు మూడేళ్ల‌లోనే స్టార్ డ‌మ్ అందుకోవ‌డం అనేది అరుదు.

By:  Sivaji Kontham   |   26 Oct 2025 9:42 AM IST
కేవ‌లం 9ఏళ్ల‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా ర‌ష్మిక జ‌ర్నీ
X

కెరీర్ ప్రారంభించిన కేవ‌లం రెండు మూడేళ్ల‌లోనే స్టార్ డ‌మ్ అందుకోవ‌డం అనేది అరుదు. ముఖ్యంగా న‌ట‌వార‌సులు సైతం సినీరంగంలో ల‌క్ చిక్క‌క‌, స‌రైన విజ‌యాల్లేక కెరీర్ ప‌రంగా స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. సినిమా సోద‌ర‌భావానికి దూరంగా, సొంత ప్ర‌తిభ‌తో ఎదిగేవారు చాలా త‌క్కువ‌మంది. అలాంటి అరుదైన స్టార్ ర‌ష్మిక మంద‌న. ఈ బ్యూటీ కెరీర్ ప్రారంభించిన కేవ‌లం రెండు మూడేళ్ల‌లోనే స్టార్ గా నిరూపించుకుంది. వ‌రుస విజ‌యాల‌తో ల‌క్ కూడా ఫేవ‌ర్ చేయ‌డంతో ఎదురేలేని స్థానానికి ఎదిగింది.




తొలుత టాలీవుడ్ అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించిన ర‌ష్మిక మంద‌న, యువ‌హీరోల‌తోను అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుంది. ఛ‌లో, గీత గోవిందం లాంటి ల్యాండ్ మార్క్ హిట్ చిత్రాలు ర‌ష్మిక స్థాయిని పెంచాయి. నేటికి నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 9 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. 9 ఏళ్ల కెరీర్ లో నాలుగు భాషల్లో మొత్తం 25 సినిమాల‌లో నటించింది. ఈ సినిమాల్లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో పాటు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సినిమాలు ఉన్నాయి. హీరోయిన్స్ ప్రాంతీయంగా పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధిస్తూ తన స్టార్ డమ్ క్రేజ్ చూపిస్తోంది రశ్మిక. అందం, నటన, ఆకర్షణతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. సాటి హీరోయిన్ కు లేనంత క్రేజ్ త‌న సొంతం.

భార‌త‌దేశంలో వ‌రుస‌గా 1000 కోట్ల క్లబ్ సినిమాల్లో న‌టిస్తున్న మేటి నాయిక‌గాను ర‌ష్మిక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్ప‌టికే యానిమ‌ల్, పుష్ప 2 చిత్రాల‌తో వెయ్యి కోట్ల క్ల‌బ్ నాయిక అయింది. త‌దుప‌రి యానిమ‌ల్ పార్క్ చిత్రం అదే స్థాయిలో దూసుకుపోతుంద‌ని అంచ‌నా. ఇంకా బాలీవుడ్ లో ప‌లువురు అగ్ర హీరోల స‌ర‌స‌నా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. కెరీర్ ఆరంభ‌మే హిందీ చిత్ర‌సీమ దిగ్గ‌జాలు అమితాబ్ , స‌ల్మాన్ ఖాన్ లాంటి స్టార్ల‌తో అవ‌కాశాలు అందుకుంది.

రశ్మిక నటించిన పుష్ప, పుష్ప 2, యానిమల్, చావా, థామా చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి. అయితే బాక్సాఫీస్ నెంబర్స్ కంటే ప్రేక్షకుల ప్రేమే తనకు ముఖ్యమని చెబుతుంది రశ్మిక. ఈ అందాలతార తన విజయాలను కొనసాగిస్తూ మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకెళుతోంది. రశ్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ లో రశ్మిక పర్ ఫార్మెన్స్ మెస్మరైజ్ చేస్తోంది. `ది గర్ల్ ఫ్రెండ్` సినిమా రశ్మిక కెరీర్ లో మరో మైల్ స్టోన్ కాబోతోందనే అంచ‌నాలేర్ప‌డ్డాయి.