విజయ్ కి రష్మిక లక్కీ అవుతుందా..?
సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని దాన్ని కూడా ఇంకా దాచేస్తూ వస్తున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక. ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ రింగ్ తో కనిపిస్తున్నారు. అడిగితే మీకు తెలుసు కదా అని అంటున్నారు.
By: Ramesh Boddu | 7 Nov 2025 5:00 PM ISTసీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని దాన్ని కూడా ఇంకా దాచేస్తూ వస్తున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక. ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ రింగ్ తో కనిపిస్తున్నారు. అడిగితే మీకు తెలుసు కదా అని అంటున్నారు. ఐతే ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో వచ్చింది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ కి మంచి ఫీడ్ బ్యాక్ వస్తుంది. రాహుల్ రవింద్రన్ రష్మికతో ఒక మంచి ప్రయత్నమే చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఐతే ది గర్ల్ ఫ్రెండ్ తో రష్మిక తన సత్తా చాటినట్టేనని తెలుస్తుంది.
ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ రష్మిక తొలి సినిమా..
సో ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ రష్మిక తొలి సినిమా సక్సెస్ అందుకున్నట్టే లెక్క. ఇక నెక్స్ట్ రాబోతున్న సినిమాలు కూడా రష్మిక ఖాతాలో క్రేజీ సినిమాలుగా ఉన్నాయి. మరోపక్క విజయ్ దేవరకొండ రష్మికతో ఎంగేజ్మెంట్ తర్వాత రవికిరణ్ కోలా డైరెక్షన్ లో రౌడీ జనార్ధన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో విజయ్ కి కూడా లక్ కలిసి వస్తుందా లేదా అంటూ చర్చిస్తున్నారు.
రష్మికకు విజయ్ ఎలా లక్ అయ్యాడో.. విజయ్ కి కూడా నేషనల్ క్రష్ లక్ అవుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే విజయ్ కొన్నాళ్లుగా సరైన సాలిడ్ హిట్ లేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మరోపక్క అతన్ని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసే వాళ్లు కూడా ఎక్కువ అయ్యారు. వాళ్లందరికీ సమాధానం చెప్పాలంటే ఒక సాలిడ్ సూపర్ హిట్ కొట్టాల్సిందే. ఐతే విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ సినిమా అదే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.
రౌడీ జనార్ధన్ తర్వాత విజయ్ దేవరకొండ..
రౌడీ జనార్ధన్ తర్వాత విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. రౌడీ జనార్ధన్ తో పాటుగా వీడీ 14వ సినిమాకు రష్మిక జత కట్టి మరీ విజయ్ కి హిట్ ఇవ్వాలని చూస్తుంది. సో ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ తర్వాత కెరీర్ ఎలా ఉండబోతుంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు కూడా ఫిబ్రవరిలో పెళ్లికి రెడీ అయ్యారనే టాక్ వైరల్ అయ్యింది. మరి ముహూర్తం అప్పుడేనా లేదా దానికంటే ముందే పెట్టుకుంటారా అన్నది కూడా తెలియాల్సి ఉంది.
రష్మిక విజయ్ దేవరకొండ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వాళ్లు సినిమాలు కొనసాగించేలానే ప్లాన్ ఉన్నట్టు తెలుస్తుంది. వీడీ 14 పీరియాడికల్ మూవీగా వస్తుంది. ఆ సినిమాలో విజయ్ తో పాటు రష్మిక పాత్ర కూడా ఒక రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. వీడీ 13, 14 రెండు సినిమాలకు రష్మిక లక్ తోడైతే మాత్రం వీడీకి సూపర్ హిట్ షురూ అయినట్టే లెక్క.
