రౌడీ జిమ్ స్టార్ట్ చేస్తా.. క్రష్ ఎవరంటే రష్మిక ఏం చెప్పారంటే
ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక రీసెంట్ గా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షో లో పాల్గొని సందడి చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 6 Nov 2025 4:24 PM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రష్మిక సరసన దీక్షిత్ శెట్టి నటించగా, యాక్టర్ కం డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ది గర్ల్ ఫ్రెండ్ కు దర్శకత్వం వహించారు. నవంబర్ 7న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో రష్మిక యాక్టివ్ గా పాల్గొంటూ సినిమా గురించి, తన గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు.
ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక రీసెంట్ గా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షో లో పాల్గొని సందడి చేశారు. ఇప్పటికే జయమ్ము నిశ్చయమ్మురా షో కు టాలీవుడ్ లోని పలువురు సెలబ్రిటీలు హాజరవగా, ఇప్పుడు నేషనల్ క్రష్ వంతొచ్చింది. అయితే రష్మిక ఎపిసోడ్ కు సంబంధించిన తాజా ప్రోమో ఒకటి రిలీజవగా అది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
ఇప్పుడు చెప్తే తర్వాత నన్ను ఏసుకుంటారు
షో లో భాగంగా రష్మిక చేసే అల్లరి పనుల గురించి జగపతి అడగ్గా, వద్దండి, నేనిప్పుడు చెప్తే తర్వాత వాళ్లు ఏసుకుంటారు అని రష్మిక సరదాగా ఆన్సర్ ఇచ్చారు. లాస్ట్ మెసేజ్ ఎవరికి చేశారనే ప్రశ్నకు తర్వాత మాట్లాడుకుందామని జవాబిచ్చారు రష్మిక. నన్నెప్పుడైనా కలవాలనుకుంటే జిమ్ కు రండి అని రష్మిక చెప్పగా, ఏ జిమ్ కు రావాలో మాత్రం చెప్పట్లేదని జగపతి అన్నారు.
జిమ్ స్టార్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తా
దానికి వెంటనే రష్మిక తాను రౌడీ జిమ్ అని ఒకటి స్టార్ట్ చేస్తానని, అందులో తానే అందరికీ ట్రైనర్ గా వ్యవహరిస్తానని చెప్పారు. ఇక మీ క్రష్ ఎవరిని జగపతి అడగ్గా, ఆడియన్స్ వైపు చూస్తూ సైగలు చేసిన రష్మిక మీలో ఎవరైనా విజయ్ అనే పేరున్న వాళ్లు ఉన్నారా అని సరదాగా అన్నారు. రష్మిక ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోనే ఇంత ఎంటర్టైనింగ్ గా ఉంటే ఇక ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందోనని చూడ్డానికి ఆడియన్స్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు
