Begin typing your search above and press return to search.

దెయ్యంగా నేష‌న‌ల్ క్ర‌ష్?

రాఘ‌వ లారెన్స్ న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ హార్ర‌ర్ కామెడీ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   1 Sept 2025 12:32 PM IST
దెయ్యంగా నేష‌న‌ల్ క్ర‌ష్?
X

థ్రిల్ల‌ర్, హార్ర‌ర్, కామెడీ హార్ర‌ర్ ఈ జానర్ల‌కు ఆడియ‌న్స్‌లో స్పెష‌ల్ క్రేజ్ ఉంటుంది. అందులో హార్ర‌ర్ కామెడీకి ఇంకాస్త ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అయితే హార్రర్ కామెడీ సినిమాలు, అందులోనూ హిట్ ఫ్రాంచైజ్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రాఘ‌వ లారెన్స్ కాంచ‌ననే. ఓ వైపు కామెడీతో న‌వ్విస్తూనే మ‌రోవైపు హార్ర‌ర్ తో భ‌య‌పెట్ట‌డం లారెన్స్ స్పెషాలిటీ.

కాంచ‌న‌4 షూటింగ్ లో లారెన్స్ బిజీ

మంచి మెసేజ్ తో పాటూ ఆడియ‌న్స్ ను అల‌రించే రాఘ‌వ లారెన్స్ ఇప్ప‌టికే కాంచ‌న ఫ్రాంచైజ్ లో ప‌లు సినిమాలు చేసి వాటితో మంచి హిట్లు అందుకున్నారు. మునితో మొద‌లైన ఈ ట్రెండ్ ఇప్పుడు కాంచ‌న‌4 వ‌ర‌కు వ‌చ్చింది. లారెన్స్ ప్ర‌స్తుతం కాంచ‌న‌4 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ ఈ సినిమాను అనౌన్స్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్లారు లారెన్స్.

కీల‌క పాత్ర‌ల్లో పూజా హెగ్డే, నోరా ఫ‌తేహీ

రాఘ‌వ లారెన్స్ న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ హార్ర‌ర్ కామెడీ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. పూజాతో పాటూ బాలీవుడ్ బ్యూటీ నోరా ఫ‌తేహి కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే కాంచ‌న‌4 గురించి ఇప్పుడో క్రేజీ న్యూస్ కోలీవుడ్ మీడియాలో తెగ వినిపిస్తోంది.

క్యాస్టింగ్ తోనే అంచ‌నాలు పెంచేస్తున్న లారెన్స్

ఈ సినిమాలో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక కూడా జాయిన్ అయ్యార‌ని, కాంచ‌న‌4లో ర‌ష్మిక కూడా పూజాతో పాటూ దెయ్యంగా క‌నిపించ‌నున్నార‌ని అంటున్నారు. ఓ స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ కోసం లారెన్స్, ర‌ష్మిక‌ను రంగంలోకి దించార‌ని అంటున్నారు. ఆల్రెడీ దీనిపై డిస్క‌ష‌న్స్ కూడా జ‌రిగాయ‌ని స‌మాచారం. ఇదే నిజ‌మైతే అటు సౌత్ తో పాటూ ఇటు నార్త్ లో కూడా కాంచ‌న‌4 పై భారీ అంచ‌నాలు పెర‌గ‌డం ఖాయం. లారెన్స్ ఈ సినిమా క్యాస్టింగ్ తోనే సినిమాపై హైప్ ను విప‌రీతంగా పెంచేస్తున్నారు. అయితే ఈ విష‌యంపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

వ‌రుస సినిమాల‌తో బిజీ

వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకెళ్తున్న ర‌ష్మిక ప్ర‌స్తుతం బాలీవుడ్ హార్ర‌ర్ కామెడీ థ్రిల్ల‌ర్ థామాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో ర‌ష్మిక చాలా విభిన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు ఆల్రెడీ రిలీజైన ఫ‌స్ట్ లుక్ ను బ‌ట్టి చూస్తుంటే తెలుస్తోంది. థామాతో పాటూ ది గ‌ర్ల్‌ఫ్రెండ్, రెయిన్‌బో, మైసా సినిమాల‌తో ర‌ష్మిక బిజీగా ఉండ‌గా, ఇప్పుడు మ‌రో హార్ర‌ర్ కామెడీ మూవీ అయిన కాంచ‌న‌4కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం విశేషం.