దసరా కల్లా నేషనల్ క్రష్ ఎంట్రీ పై క్లారిటీ!
బాలీవుడ్ హిట్ ప్రాంచైజీ `క్రిష్` నుంచి `క్రిష్ 4`కి సన్నాహాకాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 20 Sept 2025 11:54 AM ISTబాలీవుడ్ హిట్ ప్రాంచైజీ `క్రిష్` నుంచి 'క్రిష్ 4'కి సన్నాహాకాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈసారి హృతిక్ రోషన్ నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు. దీంతో సినిమా మరింత ప్రతిష్టాత్మ కంగా మారింది. హృతిక్ మేకింగ్..టేకింగ్ ఎలా ఉంటుంది? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రతీ పని హృతిక్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. స్క్రిప్ట్ సిద్దం చేయడం దగ్గర నుంచి ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులన్ని తన కను సన్నలోనే జరుగుతున్నాయి. ఈ విషయంలో డాడ్ రాకేష్ రోషన్ నిర్మాతగా వెనుకుండి తాను తనయుడికి అందించాల్సినవన్నీ అందించడమే.
పోటీగా కార్పోరేట్ సంస్థలు:
తనయుడు కెప్టెన్ అవుతోన్న చిత్రం కావడంతో తండ్రి కూడా అంతే సంతోషంగా ఉన్నారు. తనయుడిగా నటనకే పరిమితమవ్వకుండా డాడీ బాధ్యతలు కూడా హృతిక్ తీసుకోవడంతో తనయుడిని చూసి మురిసిపోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి ప్రపంచమే గొప్ప గా మాట్లాడుకునే స్థాయిలో ఉండాలంటే? తన నిర్మాణ సంస్థతో పాటు భారీ నిర్మాణ సంస్థలు కూడా సినిమాలో భాగం అవ్వొచ్చు అంటూ పబ్లిక్ గా ప్రకటించారు. దీంతో పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. బాలీవుడ్ సంస్థలకు పోటీగా పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నాయి.
సానుకూలంగా రష్మిక స్పందన:
ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా నటిస్తోందని ప్రచారం కొన్ని రోజులుగా వైరల్ అవుతోన్న నసంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా రష్మికని ఏరికోరి మరీ తీసుకుంటు న్నారే ప్రచారం ఠారెత్తిపోతుంది. పాన్ ఇండియాలో అమ్మడికి ఉన్న ఇమేజ్ కారణంగానే ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో భాతగమవుతుందనే వార్త దావానాలా వ్యాపించింది. మరి ఇందులో నిజమెంత? అంటే ఇప్పటికే నిర్మాణ వర్గాలు ఆమెని అప్రోచ్ అవ్వడం...సానుకూలంగా స్పందించడం జరిగిందని వస్తోంది అన్నది వాస్తవమే.
రెండు భాషల్లోనూ బిజీ బిజీగా:
అయితే క్లారిటీ రావడానికి మాత్రం మరికొన్ని రోజులు పడుతుందని తెలిసింది. నిర్వాహకులు ఆమెను అప్రోచ్ అవ్వగా జాయిన్ అవుతాననే ప్రామిస్ చేసిందట. కానీ అదే విషయాన్ని క్లియర్ గా ఇప్పుడే చెప్పలేనని దసరా కల్లా తాజా సినిమాలపై ఓ క్లారిటీ వస్తందని..అనంతరం అగ్రిమెంట్ చేసుకుందామని సూచించిదట. ప్రస్తుతం రష్మిక తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. వీటిలో ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రం కూడా ఉన్న సంగతి తెలిసిందే.
