Begin typing your search above and press return to search.

అత్త మ‌న‌సు గెలిచిన ముద్దుల కోడులు!

విజ‌య్ దేవరకొండ- రష్మిక మందన్నల బంధం వెండితెరపై మొదలై నేడు అందమైన వైవాహిక జీవితం వరకు చేరుకుంది.

By:  Srikanth Kontham   |   22 March 2026 1:00 AM IST
అత్త మ‌న‌సు గెలిచిన ముద్దుల కోడులు!
X

విజ‌య్ దేవరకొండ- రష్మిక మందన్నల బంధం వెండితెరపై మొదలై నేడు అందమైన వైవాహిక జీవితం వరకు చేరుకుంది. ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అత్యంత అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ బంధంలో అత్యంత ఆసక్తికరమైన హృదయాన్ని హత్తు కునే అంశం ఏంటంటే? అత్త మాధవి దేవరకొండ - కోడలు రష్మిక మధ్య ఉన్న అద్భుతమైన అనుబంధం. కోడలిగా కంటే? ఒక కూతురిలా రష్మికకు మాధవి ఇస్తోన్న‌ గౌరవం, చూపిస్తున్న ప్రేమ చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

ఇటీవల జరిగిన `తెలంగాణ గద్దర్ మూవీ అవార్డ్స్` వేదికపై ఈ బంధం మరోసారి అందరికీ స్పష్టమైంది. `ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న రష్మిక వేదికపై మాట్లాడుతూ తన అత్తగారి గురించి ఎంతో భావోద్వేగంగా స్పందించింది. `నేను కోడలు కాకముందు నుంచే మీరు న‌న్ను కూతురిలా ప్రేమించారు. ఈ రోజు అధికారికంగా కోడలిగా మీ ముందు నిలబడటం నాకు ఎంతో గర్వంగా ఉంది` అని రష్మిక పేర్కొనడం అందరినీ కదిలించింది. రష్మిక మాటలకు అత్త మాధవి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారందరినీ ఎంత‌గానో అలరించింది.

విజయ్ తల్లి మాధవి కూడా గతంలోనే తమ కోడలు ఎలా ఉండాలో తన మనసులో మాటను బయటపెట్టారు.`నా కొడుకును కంటికి రెప్పలా చూసుకునే కోడలు వస్తే చాలు. నా కొడుకును బేషరతుగా ప్రేమించే వ్యక్తి కావాలి` అని ఆమె కోరుకున్నారు. రష్మికలో తాను కోరుకున్న ఆ లక్షణాలన్నీ కనిపించాయి. ఇప్పుడు మాధ‌వి కోడలు ఒక స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు. తన కుటుంబంలో ఒక భాగమని మాధవి గర్వంగా భావిస్తున్నారు. అందుకే రష్మిక గెలిచిన ప్రతి విజయంలోనూ అత్తమ్మను భాగస్వామిని చేస్తోంది.

వీరి మధ్య ఉన్న అనుబంధం కేవలం మాటలకే పరిమితం కాలేదు. బయట తిరిగేటప్పుడు కూడా రష్మిక తన అత్తగారితో కలిసి ఉండటానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. ఆ అవార్డు ఫంక్షన్‌కు కూడా మాధవి గారితోనే కలిసి వెళ్లడం చూడొచ్చు. స్టేజ్ మీద ఆమెను ఉద్దేశించి `పాపలు (అత్తమ్మ) నేను సాధించాను.. ఇక ఇంటికి వెళ్లి పార్టీ చేసుకుందాం` అని రష్మిక సరదాగా అనడం వారి మధ్య ఉన్న స్వేచ్ఛ‌ను , స్నేహాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి బాధ్యతాయుతమైన కోడలు, ప్రేమిస్తున్న అత్తగారి కాంబినేషన్ చూడటం నిజంగా అరుదని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

వీరి మధ్య ఉన్న ఈ సాన్నిహిత్యం ఇతర సెలబ్రిటీలకు అంతే అవ‌స‌రం. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలకు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది. విజయ్ - రష్మిక తమ వృత్తిపరమైన విజయాలను కుటుంబంతో ఎలా పంచుకుంటున్నారో? రష్మిక తన అత్తగారితో ఏర్పరచుకున్న ఈ అనుబంధం కూడా అంతే అందంగా ఉంది. రష్మిక కుటుంబం పట్ల చూపిస్తున్న ఆప్యాయత, విజయ్ దేవరకొండ ఇంట్లో ఆమెను ఒక కోడలిగా కాకుండా, ఆ ఇంటికి వచ్చిన మహాలక్ష్మిలా, సొంత కూతురిలా చూసుకుంటున్నారని స్పష్టమవుతోంది.

మొత్తానికి వెండితెరపై విజయ్-రష్మికలు ఎంతటి క్రేజీ జోడీనో? నిజ జీవితంలో అత్తా-కోడళ్లుగా మాధవి-రష్మికలు కూడా అంతటి క్రేజీ జంటగా మారిపోయారు. రష్మిక సక్సెస్‌ను చూసి అత్తగారు మురిసిపోతుంటే? అత్తగారి ప్రేమను చూసి రష్మిక గ‌ర్వ‌ప‌డుతుంది. ఈ అందమైన కుటుంబ బంధం అందరికీ స్ఫూర్తినిస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్న ఈ బంధం రాబోయే రోజుల్లో మరిన్ని మధురమైన జ్ఞాపకాలను మిగిల్చుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.