Begin typing your search above and press return to search.

జ‌పాన్ ఫ్యాన్స్ కు నేష‌న‌ల్ క్ర‌ష్ ప్రామిస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా తెర‌కెక్కిన పుష్ప‌2: ది రూల్ ఏ స్థాయిలో విజ‌యవంతం అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   19 Jan 2026 5:44 PM IST
జ‌పాన్ ఫ్యాన్స్ కు నేష‌న‌ల్ క్ర‌ష్ ప్రామిస్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా తెర‌కెక్కిన పుష్ప‌2: ది రూల్ ఏ స్థాయిలో విజ‌యవంతం అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన పుష్ప‌2 పేరిట ఎన్నో రికార్డులు కూడా న‌మోద‌య్యాయి. ఇండియాలో ప‌లు రికార్డులు సృష్టించిన పుష్ప‌2 రీసెంట్ గా జ‌పాన్ లో రిలీజైంది.

జ‌ప‌నీస్ లో మాట్లాడి ఆక‌ట్టుకున్న‌ ర‌ష్మిక‌

జ‌న‌వ‌రి 16న పుష్ప‌2 సినిమా పుష్ప క్రునిన్ అనే పేరుతో జ‌పాన్ లో రిలీజ‌వ‌గా, చిత్ర ప్ర‌మోష‌న్స్ కోసం అల్లు అర్జున్, ర‌ష్మిక అక్క‌డికి వెళ్లారు. ప్ర‌మోష‌న్స్ కోసం జ‌పాన్ కు వెళ్ల‌న ర‌ష్మిక‌కు అక్క‌డి ఫ్యాన్స్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ర‌ష్మిక అక్క‌డి వారి కోసం స్పెష‌ల్ గా జ‌ప‌నీన్ లో మాట్లాడి అంద‌రినీ ఆకట్టుకున్నారు.

జ‌పాన్ ఫ్యాన్స్ గురించి ర‌ష్మిక ఎమోష‌న‌ల్ పోస్ట్

ర‌ష్మిక త‌న జపాన్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ ఒక‌టి ఇప్పుడు నెట్టింట వైర‌ల‌వుతోంది. జ‌పాన్ టూర్ లో ఫ్యాన్స్ చూపిన ప్రేమ‌, ఆప్యాయ‌త‌ల‌కు తాను కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. జ‌పాన్.. మీరెప్పుడూ నా హృద‌యాన్ని సంతోషంతో నింపేస్తారు. మీ అభిమానం, ద‌య ఎప్ప‌టికీ మార‌వు. జ‌పాన్ కు వ‌చ్చిన ప్ర‌తీసారీ మ‌రింత కృత‌జ్ఞ‌త‌తో తిరిగి వెళ్తానని త‌న ఇన్‌స్టా పోస్ట్ లో రాసుకొచ్చారు ర‌ష్మిక‌.

జ‌పాన్ టూర్ లో ఫ్యాన్స్ త‌న‌కిచ్చిన గిఫ్ట్స్, లెట‌ర్స్ ను చూసి ఎమోష‌న‌ల్ అయిన ర‌ష్మిక‌, వాటన్నింటినీ త‌న‌తో పాటూ ఇంటికి తెచ్చుకున్న‌ట్టు కూడా చెప్పారు. ఒక్క రోజులో ఇంత ప్రేమ‌ను అందుకోవం చాలా ఆనందాన్నిచ్చింద‌ని, మీరిచ్చిన ప్ర‌తీ గిఫ్ట్‌నూ, లెట‌ర్ ను చూశాన‌ని, జ‌పాన్ కు మ‌ళ్లీ వ‌స్తాన‌ని, ఈసారి ఎక్కువ రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుంటాన‌ని, ఈసారి వ‌చ్చిన‌ప్పుడు జ‌ప‌నీస్ బాగా నేర్చుకుని వ‌స్తాన‌ని ప్రామిస్ చేశారు ర‌ష్మిక‌. ఇక కెరీర్ విష‌యానికొస్తే ర‌ష్మిక ప్ర‌స్తుతం మైసా అనే పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తున్నారు.