పాపం రష్మిక.. అన్నీ ఉన్నా ఆస్వాదించలేని పరిస్థితి!
ఈమె లుక్కు చూసి అందరూ అంతగా నవ్వుకుంటున్నారు. ఫిట్నెస్ పేరిట నచ్చిన ఆహారానికి కూడా దూరం కావాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
By: Madhu Reddy | 17 Oct 2025 7:49 PM ISTసాధారణంగా కొన్ని కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి అంటే అన్నీ ఉన్నా కూడా అనుభవించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సెలబ్రిటీల పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. వరుస సినిమాలు.. భారీ బ్లాక్ బస్టర్లు.. అంతకు మించిన ఆదాయంతో ఇండస్ట్రీలో తమకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఎంతోమంది అన్నీ ఉన్నా కూడా.. కడుపు నిండా నచ్చిన ఆహారాన్ని తినడానికి కూడా నోచుకోకపోవడం ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. పాపం ఇలాంటి జాబితాలోకే ఇప్పుడు రష్మిక కూడా వచ్చి చేరిపోయింది. అన్నీ ఉన్నా ఆస్వాదించలేని ఈమె పరిస్థితిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా సెలబ్రిటీలు ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా యంగ్ గా, ఫిట్ గా, అందంగా ఉంటేనే సినిమాలలో అవకాశాలు వస్తాయన్న విషయం ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు కూడా.. అందుకే ఈ ఫిట్నెస్ కోసం హీరోయిన్ తమకు నచ్చిన ఆహారాన్ని కూడా తీసుకోవడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. సరిగా ఇప్పుడు రష్మిక విషయంలో కూడా అదే జరిగిందనే చెప్పాలి. తాజాగా జిమ్ లో త్రెడ్ మిల్ పై ఎక్సర్ సైజ్ చేస్తున్న రష్మిక ఎదుట నోరూరించే డెసర్ట్ ఉంచారు. అయితే ప్రస్తుత ఆమె డైటింగ్ లో ఉంది కాబట్టి దానిని తినలేని పరిస్థితి. ఒకవైపు ఎక్సర్ సైజ్ .. మరోవైపు ఎదుట ఇష్టమైన డెసర్ట్.. ఏం చేయాలో తెలియక.. ముఖం మాడ్చుకొని మరొకవైపు కాస్త కోపంగా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది రష్మిక.
ఈమె లుక్కు చూసి అందరూ అంతగా నవ్వుకుంటున్నారు. ఫిట్నెస్ పేరిట నచ్చిన ఆహారానికి కూడా దూరం కావాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది ఆ పాటకి మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి అక్కడున్న డెసర్ట్ కి భలే సూట్ అయింది అంటూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది పాపం రష్మిక.. అన్నీ ఉన్నా రుచిని ఆస్వాదించలేని పరిస్థితి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రష్మిక మాత్రం తనకు నచ్చిన డెసర్ట్ ని కళ్ళ ముందున్న తినలేకపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రష్మిక విషయానికి వస్తే.. కన్నడ బ్యూటీ అయిన ఈమె ఛలో సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత పలు చిత్రాలు చేసి పుష్ప, పుష్ప 2, ఛావా, యానిమల్, కుబేర అంటూ వరుసగా విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న చిత్రాల విషయానికొస్తే థామా, కాంచన 4, రెయిన్బో , ది గర్ల్ ఫ్రెండ్ ఇలా చాలా చిత్రాలలోనే ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. అంతేకాదు అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా కీ రోల్ పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
