Begin typing your search above and press return to search.

రాహుల్ అలా చేస్తారనుకోలేదు.. ఆశ్చర్యంలో రష్మిక!

రష్మిక మందన్నా.. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేతిలో ఉన్నన్ని ప్రాజెక్టులు స్టార్ హీరోల చేతిలో కూడా లేవు.

By:  Madhu Reddy   |   25 Oct 2025 12:19 PM IST
రాహుల్ అలా చేస్తారనుకోలేదు.. ఆశ్చర్యంలో రష్మిక!
X

రష్మిక మందన్నా.. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేతిలో ఉన్నన్ని ప్రాజెక్టులు స్టార్ హీరోల చేతిలో కూడా లేవు. అలా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న రీతిలో అవకాశాలు వచ్చినప్పుడే వాటిని వినియోగించుకుంటుంది.తన చేతి దాక వచ్చిన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా రిజెక్ట్ చేయకుండా ప్రతి ఒక్క సినిమాని ఎంత కష్టమైనా సరే మూడు నాలుగు షిఫ్టులో అయినా వర్క్ చేస్తూ తిండి నిద్రా లేకుండా సినిమాల కోసమే తన టైమ్ మొత్తాన్ని కేటాయిస్తోంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది ఏకంగా ఛావా, కుబేర, సికందర్ వంటి మూడు సినిమాలతో ఇప్పటికే బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇక ఈ మూడు సినిమాల్లో ఛావా, కుబేర రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించాయి. అటు సికందర్ మూవీ ప్లాఫ్ అయినా కూడా ఆ ప్లాఫ్ రిజల్ట్ రష్మిక సినిమాలపై ఏమి పడలేదు. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలు చేసినప్పటికీ మరో సినిమా విడుదలయ్యింది.

అలా రష్మిక బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా తో కలిసి చేసిన థామా మూవీ ఇప్పటికే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే రష్మిక నటించిన మరో మూవీ కూడా విడుదల కాబోతోంది.. అదే ది గర్ల్ ఫ్రెండ్..అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడు లు నిర్మాతలుగా..రష్మిక మందన్నా నటించిన తాజా మూవీ ది గర్ల్ ఫ్రెండ్.. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీకి సింగర్ చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా చేశారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాహుల్ రవీంద్రన్ ని పొగుడుతూ రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

సింగర్ చిన్మయి నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది రష్మిక.. ఇందులో రాహుల్ రవీంద్రన్ గురించి మాట్లాడుతూ.. "నేను ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాను.కానీ కాస్ట్యూమ్ గురించి అస్సలు ఆలోచించను. వాళ్ళు షూటింగ్ సెట్లోకి వెళ్ళగానే ఈ కాస్ట్యూమ్ వేసుకొని రా అని అంటే.. ఒక్క నిమిషం కూడా అడ్డు చెప్పకుండా వెళ్లి క్యాస్ట్యూమ్ ను ధరించి వస్తాను.కానీ ఫర్ ది ఫస్ట్ టైం రాహుల్ రవీంద్రన్ నా దగ్గరికి వచ్చి నీకు ఇష్టం ఉన్న కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఇక ఆయన మాటలకి నేను షాక్ అయ్యా. అసలు ఈయన ఎందుకు నన్ను సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నారు అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. అసలు రాహుల్ అలా అడుగుతారని అలా చేస్తారని నేను అనుకోలేదు. ఆయన మాటలకి మొదట నేను ఆశ్చర్యపోయాను. ఇప్పటివరకు ఎవరూ కూడా నన్ను ఇలా అడగలేదు. మొదటిసారి రాహుల్ అలా అడిగేసరికి షాక్ లో మునిగిపోయాను "అంటూ రష్మిక రాహుల్ రవీంద్రన్ ని పొగిడింది.

అయితే హీరోయిన్స్ ఎవరైనా సరే డైరెక్టర్ చెప్పిన కాస్ట్యూమ్స్ వేసుకోవాల్సి వస్తుంది. హీరోయిన్లకు ఇష్టం లేకపోయినా సరే డైరెక్టర్ చెప్పిందే చేయాలి. కానీ రాహుల్ రవీంద్రన్ మాత్రం హీరోయిన్ ని కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పడం చాలా గ్రేట్ అని రష్మిక పొగిడింది.

రష్మిక మందన్నా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నవంబర్ 7న విడుదల కాబోతోంది.. ఈ సినిమానే కాకుండా రష్మిక రెయిన్బో, మైసా అనే లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో కూడా నటిస్తోంది.అలాగే అల్లు అర్జున్ హీరోగా.. అట్లీ డైరెక్షన్లో వస్తున్న మూవీలో కూడా రష్మిక గెస్ట్ రోల్ పోషిస్తుందట. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ చేతిలో పుష్ప-3, అనిమల్ -2 సీక్వెల్ మూవీస్ కూడా ఉన్నాయి. అలా వరుస సినిమాలతో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది రష్మిక.