Begin typing your search above and press return to search.

పుకార్లకు చెక్.. పెళ్లి లేదు కానీ

రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ.. సినీ సెలబ్రిటీలుగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న వీరు.. తమ సినిమాలతో ఎలా అయితే పాపులారిటీ సంపాదించుకుంటున్నారో.. అంతకుమించి వ్యక్తిగత కారణాల వల్ల క్రేజ్ సొంతం చేసుకున్నారు.

By:  Madhu Reddy   |   2 Feb 2026 12:10 PM IST
పుకార్లకు చెక్.. పెళ్లి లేదు కానీ
X

రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ.. సినీ సెలబ్రిటీలుగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న వీరు.. తమ సినిమాలతో ఎలా అయితే పాపులారిటీ సంపాదించుకుంటున్నారో.. అంతకుమించి వ్యక్తిగత కారణాల వల్ల క్రేజ్ సొంతం చేసుకున్నారు. గీతాగోవిందం అనే సినిమాతో తొలిసారి ఈ జంట కాంబినేషన్ గా వెండితెరకు పరిచయమైంది. 2018లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈ జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది..ఇక అప్పటినుంచి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అనే వార్తలు వినిపించాయి..దీనికి తోడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం డియర్ కామ్రేడ్. 2019లో వచ్చిన ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది.

ఈ సినిమా సమయంలో వీరి మధ్య ప్రేమ మరింత బలపడిందని.. ఇద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారని వార్తలు వినిపించాయి. దీనికి తోడు ఇద్దరు కలిసి వెకేషన్ లకి వెళ్లడం.. ఒకరి కుటుంబ సభ్యులతో మరొకరు కనిపించడం ఇలా ఎన్నో జరిగిపోయాయి.పైగా వీరిద్దరూ రహస్యంగా తమ ప్రేమ బంధాన్ని కొనసాగించారు కానీ అభిమానులు మాత్రం ఊరుకుంటారా.. వీరి రహస్య ప్రయాణాలను బయటపెడుతూ ఎప్పటికప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి పుకార్లు సృష్టిస్తూనే ఉన్నారు.

దీనికి తోడు గత ఎడాది వీళ్ళిద్దరూ రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయంపై అధికారికంగా ప్రకటించకపోయిన వీరి చేతి వేళ్ళకున్న డైమండ్ ఉంగరాలు వీరికి నిశ్చితార్థం జరిగిందనే విషయాన్ని స్పష్టం చేశాయి.. ఇక త్వరలోనే పెళ్లి అంటూ గతంలో వార్తలు వినిపించాయి. అయితే దీనిపై స్పందించిన రష్మిక గత నాలుగేళ్లుగా ఇలాంటి పుకార్లు ఎదుర్కొంటున్నాను. తప్పకుండా సమయం వచ్చినప్పుడు అన్ని తెలియజేస్తాను అంటూ తెలిపింది. దీంతో రష్మిక తన పెళ్లి గురించి చెబుతుందా లేక మరేదైనా చెబుతుందా అని అయోమయంలో పడ్డారు అభిమానులు.

అయితే కొన్ని రోజుల క్రితం సడన్ గా ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడైన శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. విజయ్ రష్మిక జంటకు శుభాకాంక్షలు చెబుతూ వారి పెళ్లికి తమ తరఫున అత్యంత నాణ్యమైన డచ్ గులాబీలు పంపిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు ఈ ఫ్లవర్స్ వారి వేడుకను మరింత అందంగా మారుస్తాయని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పడంతో ఇక నిజంగానే వీరి పెళ్లి ఫిక్స్ అయ్యింది అంటూ అభిమానులు ఒక నిర్ధారణకు వచ్చేసారు. దీనికి తోడు ఫిబ్రవరి 2వ తేదీన ఉదయపూర్ లో వీరి వివాహం జరగబోతోంది. అందుకు సంబంధించి, వివాహ వేడుక సిద్ధమవుతోంది అంటూ ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. పైగా ఈరోజు ఫిబ్రవరి 2.. ఇక ఇటీవల వచ్చిన వీడియోని బట్టి చూస్తే ఈ రోజు వివాహం జరగనట్టు తెలుస్తోంది. దీనిపై రష్మిక కూడా స్పందించింది. ఒకరకంగా చెప్పాలి అంటే ఫిబ్రవరి 2న వివాహం అంటూ వచ్చిన పుకార్లకు రష్మిక చెక్ పెట్టింది.

మరోవైపు గత రెండు నెలలుగా ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. మొత్తానికైతే ఫిబ్రవరి 2న వివాహం అంటూ వచ్చిన వార్తలలో నిజం లేదు కానీ ఒకవేళ ఫిబ్రవరి 26న వీరి వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మరి దీనిపై ఈ జంట స్వయంగా ప్రకటిస్తారా లేక 26న వివాహం చేసుకోబోతున్నారా అన్న విషయం తెలియాలి అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగే వరకు ఎదురు చూడక తప్పదు.