రష్మిక అమ్మాయిని లవ్ చేస్తుందా?
బాలీవుడ్‌లో ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన కాక్ టెయిల్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది.
By: M Prashanth | 20 Feb 2026 1:12 PM ISTబాలీవుడ్‌లో ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన కాక్ టెయిల్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్ టెయిల్ 2 మీద సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నటీనటుల పాత్రల గురించి వస్తున్న ఒక వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఒక షాకింగ్ లీక్ బయటకు వచ్చింది.
ఈ చిత్రంలో రష్మిక మందన్న, కృతి సనన్ స్వలింగ ప్రేమికులుగా కనిపించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బాలీవుడ్ మీడియాలో వస్తున్న ఈ వార్త విన్న అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే రష్మిక కెరీర్‌లో ఇది ఒక మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ అవుతుందని చెప్పాలి. ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్‌తో సినిమా వస్తుండటంతో అంచనాలు అప్పుడే పెరిగిపోయాయి.
మొదటి పార్ట్‌లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనే, డయానా పెంటీ మధ్య నడిచే లవ్ స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానికి భిన్నంగా హోమీ అదజానియా ఈ సీక్వెల్‌ను చాలా బోల్డ్‌గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జనరేషన్ లో మారుతున్న రిలేషన్షిప్స్ నేపథ్యంలో ఈ కథ సాగబోతోందట. లవ్ రంజన్ ఈ సినిమాకు కథ అందించడం విశేషం.
సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. యూరప్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ మూవీని సెప్టెంబర్ 2026లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కృతి సనన్ కూడా ఈ సినిమా విజువల్స్ చాలా ఫ్రెష్‌గా ఉండబోతున్నాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నేటి తరం ఆలోచనలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందని హింట్ ఇచ్చారు.
అయితే రష్మిక పాత్ర గురించి వస్తున్న ఈ రూమర్ల మీద చిత్ర యూనిట్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. బాలీవుడ్ పోర్టల్స్ లో మాత్రం ఈ వార్త తెగ హల్చల్ చేస్తోంది. షాహిద్ కపూర్ పాత్ర కూడా ఇందులో చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం. దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ మీద అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ నెలకొంది.
సెప్టెంబర్ రిలీజ్ కాబట్టి ఇంకా చాలా టైమ్ ఉంది. ఈ లోపు సినిమా నుంచి వచ్చే టీజర్ లేదా ట్రైలర్ తో రష్మిక క్యారెక్టర్ మీద ఉన్న సస్పెన్స్ వీడే ఛాన్స్ ఉంది. కేవలం రూమర్లతోనే ఇంత బజ్ క్రియేట్ అవుతుందంటే, ఇక ప్రమోషన్లు మొదలైన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రష్మిక ఈ బోల్డ్ స్టెప్ తీసుకుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
