మాకు గడ్డం రాదు..మేం మందు తాగం..అందుకే అలా!
బ్రేకప్ అయిన రష్మిక దాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా సంతోషంగా ఉందంటూ? ఇదే నిజాయితీగల ప్రేమ అంటే? అంటూ ప్రశ్నించారు. ఈ విమర్శలపై రష్మిక ఏనాడు స్పందించలేదు.
By: Srikanth Kontham | 23 Oct 2025 12:29 PM ISTవిజయ్ దేవరకొండ-రష్మికమందన్నా ప్రేమ వ్యవహారం పబ్లిక్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే నిశ్చితార్దం కూడా చేసుకున్నారు. త్వరలో ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. నటుడిగా ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత విజయ్ తొలి లవ్ రష్మిక మాత్రమే. గతంలో అతడికంటూ ఎలాంటి ప్రేమాయణాలు లేవు. ఒక్కరికే మనసిచ్చాడు. ఆమెనే వివాహం చేసుకుంటున్నాడు. ఇక రష్మిక గురించైతే చెప్పాల్సిన పనిలేదు. కన్నడ పరిశ్రమ నుంచి టాలీవుడ్ కి వచ్చిన నటి. కన్నడలో నటుడు రక్షిత్ శెట్టిని ప్రేమించింది. అతడితో ఎంగేజ్ మెంట్ కూడా అయింది.
కానీ ఎందుకనో ఇద్దరు దూరమయ్యారు. అలా రష్మిక కెరీర్ లో రక్షిత్ తొలి ప్రేమికుడిగా హైలైట్ అయ్యాడు. అయితే రక్షిత్ తో విడిపోయిన నేపత్యంలో నెటి జనులకు టార్గెట్ అయింది రష్మికనే. రష్మిక తీరు కారణంగా బ్రేకప్ అయిందంటూ ఆమెని ట్రోల్ చేసారు. బ్రేకప్ అయిన రష్మిక దాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా సంతోషంగా ఉందంటూ? ఇదే నిజాయితీగల ప్రేమ అంటే? అంటూ ప్రశ్నించారు. ఈ విమర్శలపై రష్మిక ఏనాడు స్పందించలేదు. తనని ఎంతగా దూషించినా? తాను సమాధానం చెప్పినా..చెప్పకపోయినా? వాగే నోళ్లు వాగుతూనే ఉంటాయని లైట్ తీసుకుంది.
అయితే తాజాగా రక్షిత్ శెట్టితో బ్రేకప్ సమయంలో తానెంతగా నలిగిపోయిందో? ఆమె తాజా వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోంది. మగవారు బ్రేకప్ అయితే వారు బాధలో ఉన్నారని గడ్డం పెంచడం..మందు తాగడం ద్వారా తెలుస్తుంది. కానీ అందరి అడవాళ్ల విషయంలో తామెంతగా బాధపడుతున్నామన్నది ఎవరికీ చెప్పుకోలేమంది. తమ బాధను వ్యక్త పరచడానికి తమకు గడ్డాలు లేవని...మందు తీసుకునే అలవాటు కూడా తమకు ఉండదని పేర్కొంది.
వ్యక్తిగతంగా బ్రేకప్ సమయంలో తానెంతగా నలిగిపోయానో? అది తన కుటుంబం, స్నేహితులకు మాత్రమే తెలుసని చెప్పుకొచ్చింది. బ్రేకప్ విషయంలో మగవాళ్లను మించిన బాధను మహిళలు అనుభవిస్తారని..కానీ వారిని ఎవరూ పెద్దగా పట్టించుకోరంది. బ్రేకప్ అన్నది ఇప్పుడు సహజంగా మారింది గానీ అందులో పెయిన్ మాత్రం అనుభవించే వాళ్లకే తెలుసంది. ఎన్నిసార్లు ప్రేమలో పడినా.. ఆ బంధాలు దూరమైనా బాధ మాత్రం ఉన్నన్ని రోజులు భరించాల్సిందే అంది.
