రష్మిక పవర్ పుల్ పాత్ర వెనుక కారణం!
ఈ రకమైన పెర్పార్మెన్స్ గతంలో జ్యోతిక ఇచ్చేది. ఆ తర్వాత మళ్లీ రష్మికకే ఆఛాన్స్ దక్కింది. దీంతో మైసాపై తొలి పోస్టర్ తో ఓ పాజిటివ్ ఇంప్రెషన్ పడింది.
By: Srikanth Kontham | 4 Nov 2025 6:00 PM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో రవీంద్ర పుల్లే `మైసా` అనే లేడీ ఓరియేంటెడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాలోకి రష్మిక ఎంట్రీ ఓ ఎత్తైతే? మైసా అనే టైటిల్ మరో ఎత్తులా నిలిచింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్ లో రష్మిక ఆహార్యం ఆకట్టుకుంది. రష్మిక కళ్లలో హావభావాలు కనికట్టు చేస్తున్నాయి. రష్మిక కళ్లతో నటించగల రేర్ నటి. ఈ రకమైన పెర్పార్మెన్స్ గతంలో జ్యోతిక ఇచ్చేది. ఆ తర్వాత మళ్లీ రష్మికకే ఆఛాన్స్ దక్కింది. దీంతో మైసాపై తొలి పోస్టర్ తో ఓ పాజిటివ్ ఇంప్రెషన్ పడింది.
మైసా పాత్ర వెనుక సీక్రెట్:
దీంతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది. రష్మికకు ఇదే తొలి లేడీ ఓరియేంటెడ్ చిత్రం. దీంతో తెరపై ఆమెని ఎలా ఆవిష్కరించబోతున్నాడు? అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. రష్మికకు మేల్ అండ్ పీమేల్స్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. తనకంటూ ప్రత్యేక మైన ప్యాన్ బేస్ ఉంది. రష్మిక కోసమే థియేటర్ కు వచ్చే అభిమానులు ఎంతో మంది. అలాంటి వారి ఇది షాక్ న్యూస్ అనాలా? సర్ ప్రైజింగ్ న్యూస్ అనాలో? తెలియదు గానీ ఓ ఆసక్తిర విషయం తెలిసింది. రష్మిక పాత్ర సినిమాలో ఎంత పవర్ పుల్ గా ఉంటుందన్నది తొలి పోస్టర్ తోనే ప్రూవ్ అయింది.
వాస్తవ సంఘటన స్పూర్తితోనా:
ఆ పాత్ర అంత పవర్ పుల్ గా మలచడానికి కారణం? ఆమె జీవితంలో చోటు చేసుకున్న ఓ సంఘటన కారణంగా వెలుగులోకి వస్తోంది. మైసా అత్యాచారానికి గురైన బాలికగా ప్లాష్ బ్యాక్ సన్నివేశాలుంటాయని లీకులం దుతున్నాయి. బాల్యంలో చోటు చేసుకున్నఆ చేదు సంఘటన కారణంగా మైసా పెద్దైన తర్వాత ఎలా మారుతుంది? అన్నది సినిమాలో ఆసక్తికరంగా మలుస్తున్నారుట. ఈపాత్రను తీసుకోవడానికి కారణం ఓ వాస్తవ సంఘటనగా వినిపిస్తోంది. ఆ వాస్తవ సంఘటననే ఫిక్షన్ గా మలుస్తున్నట్లు వినిపిస్తోంది.
నిజాలు తేలితేనే అసలు సంగతి:
మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి. ఇదే నిజమైతే? ఇంత వరకూ రష్మిక అలాంటి పాత్రలో నటించలేదని చెప్పాలి. కెరీర్ లో రకరకాల పాత్రలు పోషించింది. ఎంతో మంది హీరోలతో కలిసి నటించింది. ఎన్నో వైవిథ్యమైన పాత్రలు పోషించింది. కానీ అత్యాచార బాధితురాలి పాత్రలో మాత్రం నటించలేదు. రష్మికకు పాన్ ఇండియాలో ఇమేజ్ ఉంది. అలాంటి నటి బాధితురాలి పాత్ర పోషించడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. మరి ఈ ప్రచారంలో నిజా నిజాలు తేలాల్సి ఉంది.
