రష్మిక 'థామా'.. తెలుగు ట్రైలర్ ఎలా ఉందంటే..
దీపావళికి మరచిపోయిన థామా లెజెండ్ ప్రాణం పోసుకుంటుందంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలుగు ట్రైలర్ వైరల్ గా మారింది.
By: M Prashanth | 29 Sept 2025 7:29 PM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా హిట్స్ అందుకుని సందడి చేస్తున్నారు. నార్త్ టు సౌత్ అనేక చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె నటిస్తున్న మరో బాలీవుడ్ మూవీ థామా. దీపావళికి ఆ సినిమా థియేటర్స్ లో పెద్ద ఎత్తున విడుదల కానుంది.
రష్మికతోపాటు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆ సినిమాకు ఆదిత్య సర్పోత్ధార్ద్ దర్శకత్వం వహిస్తున్నారు. మడాక్ ఫిల్మ్స్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి మరో మూవీగా రాబోతున్న ఆ సినిమాను దినేష్ విజన్, అమర్ కౌశిక్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 21వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
పాన్ ఇండియా మూవీ కనుక తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. అయితే రీసెంట్ గా మేకర్స్ హిందీ ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. తాజాగా తెలుగు వెర్షన్ ను తీసుకొచ్చారు. దీపావళికి మరచిపోయిన థామా లెజెండ్ ప్రాణం పోసుకుంటుందంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలుగు ట్రైలర్ వైరల్ గా మారింది.
నువ్వు బేతాళుడివి. నిన్ను భూమిని మనుషులు రక్షించడానికి సృషించారంటూ బ్యాక్ గ్రౌండ్ లో నవాజుద్దీన్ తో చెబుతున్న డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. తాను తిరుగుబాటుదారుడిగా మారి మనుషుల రక్తం తాగాలని అనుకుంటాడు. అప్పుడే ఆయుష్మాన్ ఖురానా ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత రష్మికతో ప్రేమలో పడగా.. లవ్ స్టోరీని చూపించారు.
అయితే హీరోయిన్ కూడా అదే బేతాళ గ్రూప్ కు చెందిందని గుర్తిస్తాడు. ఆ తర్వాత హీరోలో అనేక మార్పులు వస్తాయి. మనుషులను కాపాడటానికి నవాజుద్దీన్ సిద్ధిఖీ తో యుద్ధం చేస్తారు హీరో. మరి రష్మిక ఎవరు.. చివరకు ఏం జరిగిందనేది థామా మూవీగా తెలుస్తోంది. అయితే నేషనల్ క్రష్ మరోసారి సినిమాలో తన యాక్టింగ్ తో ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు.
ఆయుష్మాన్ కూడా సెటిల్డ్ గా నటించినట్లు ఉన్నారు. హీరో తండ్రిగా పరేష్ రావల్ ఫుల్ కామెడీతో ఆకట్టుకున్నారు. హారర్, కామెడీ.. సమపాళ్లలో సినిమాలో ఉన్నట్లు తెలుస్తోంది. మడాక్ ఫిల్మ్స్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెర్ఫెక్ట్ గా సెట్ అయినట్లు అనిపిస్తోంది. మరి థామా మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
