Begin typing your search above and press return to search.

రష్మిక, శ్రీలీల.. ఒకేసారి రెండు సినిమాల ప్రమోషన్స్!

స్టార్ హీరోయిన్లు రష్మిక మందన్న, శ్రీలీల తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   28 Oct 2025 1:10 PM IST
రష్మిక, శ్రీలీల.. ఒకేసారి రెండు సినిమాల ప్రమోషన్స్!
X

స్టార్ హీరోయిన్లు రష్మిక మందన్న, శ్రీలీల తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. తమ అందం, అభినయంతో స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఓ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు వారం గ్యాప్ తో తమ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు ముద్దుగుమ్మలు.

ముందుగా శ్రీలీల మాస్ జాతర మూవీతో సందడి చేయనుండగా.. ఆ తర్వాత రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ తో థియేటర్స్ లోకి రానున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌ పై ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో నేషనల్ క్రష్ లీడ్ రోల్ లో కనిపించనున్నారు.

నవంబర్ 7వ తేదీన సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుండగా.. ఇప్పటికే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు రష్మిక. వివిధ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకు.. రాహుల్ రవీంద్రన్ తో అటెండ్ అయ్యారు. ఆ సమయంలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అయితే ఇంటర్వ్యూ మధ్యలో శ్రీలీల.. ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. వచ్చిన వెంటనే రాహుల్, రష్మికకు హగ్ ఇచ్చి పలకరించారు. ఆ తర్వాత రష్మిక, శ్రీలీల ఇద్దరు ముచ్చటించుకున్నారు. గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూసి ఫిదా అయ్యానని శ్రీలీల తెలిపారు. అలాంటి సినిమాలు చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. వెయిటింగ్ ఫర్ మూవీ అని అన్నారు.

అప్పుడే.. గర్ల్ ఫ్రెండ్ మూవీ ట్రైలర్ చూసి తనకు శ్రీలీల కాల్ చేసిందని రాహుల్ తెలిపారు. సినిమా తనకు రిలేట్ అయిందని, ట్రైలర్ బాగా నచ్చిందని చెప్పారు. చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. శ్రీలీల మాస్ జాతర మూవీని అంతా చూడాలని కోరారు. తాను సినిమాలో ఆమెను చూసేందుకు వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు.

అయితే శ్రీలీల అదే మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సర్ప్రైజ్ గా ఎంట్రీ ఇచ్చినట్లు అర్థమవుతుంది. ఏదేమైనా అది రెండు సినిమాలకు ప్రమోషన్ గా మారింది. అటు గర్ల్ ఫ్రెండ్ ట్లైలర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రాగా.. శ్రీలీల తన అభిప్రాయంతో బజ్ పెంచే ప్రయత్నం చేసింది. ఇటు మాస్ జాతరను కూడా అంతా చూడాలని రాహుల్ కోరారు. మరి ఇద్దరు ముద్దుగుమ్మలు ఎలాంటి హిట్స్ కొడతారో చూడాలి.