Begin typing your search above and press return to search.

యాక్టింగ్ తోనే కాదు స్వరంతో కూడా మెప్పిస్తున్న భామ!

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ హీరోయిన్ రాశీ ఖన్నా ఆలపించిన శివ్ కైలాషోం కే వాసి భక్తిగీతం దేశవ్యాప్తంగా విశేష స్పందనను రాబట్టుకుంటోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   16 Feb 2026 3:12 PM IST
యాక్టింగ్ తోనే కాదు స్వరంతో కూడా మెప్పిస్తున్న భామ!
X

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ హీరోయిన్ రాశీ ఖన్నా ఆలపించిన శివ్ కైలాషోం కే వాసి భక్తిగీతం దేశవ్యాప్తంగా విశేష స్పందనను రాబట్టుకుంటోంది. రాశీఖ‌న్నాకు న‌టిగానే కాకుండా సింగ‌ర్ గా కూడా ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఇప్ప‌టికే రాశీ సింగ‌ర్ గా ప‌లు పాట‌లు పాడారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు రాశీ పాడింది కేవ‌లం సినిమాల్లోని పాట‌లే.

కానీ ఇప్పుడు రాశీ దేవుని పాట పాడి అంద‌రినీ మెప్పిస్తోంది. మ‌హా శివుడిపై తనకున్న ఆత్మీయ భక్తిని హృదయపూర్వకంగా వ్యక్తం చేస్తూ ఆమె ఆలపించిన పాట ఆధ్యాత్మిక స్పర్శతో అంద‌రినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు, ఈ సాంగ్ గురించి రాశీ సోష‌ల్ మీడియా లో షేర్ చేసుకున్న ఎమోష‌న‌ల్ మెసేజ్ కూడా ఫ్యాన్స్ ను క‌దిలిస్తోంది.

ప్ర‌త్యేక రోజున పాడ‌టం ఎంతో ఆనందంగా ఉంది

ఈ పాట అహంకారాన్ని తొలగించి, అంతరంగాన్ని మేల్కొలిపి, పరమశక్తి అయిన మహా శివునికి సంపూర్ణ సమర్పణ భావాన్ని కలిగించే ప్రార్థనలా అనిపించిందని, మహా శివరాత్రి లాంటి పవిత్ర రోజున ఈ పాటను ఆలపించడం త‌న‌కు అపారమైన ఆనందాన్నిచ్చింద‌ని రాశీ త‌న పోస్టులో పేర్కొన్నారు. ఇక పాట‌లో రాశీ గొంతులోని మృదుత్వం, భావ వ్యక్తీకరణలోని నిష్కళంకత గీతాన్ని మరింత ప్రభావవంతంగా నిలబెట్టాయి.

న‌టిగా నిరూపించుకున్న రాశీ

ఇక రాశీ కెరీర్ విష‌యానికొస్తే తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సినిమాలు, సిరీస్‌లు చేస్తూ గ్లామ‌ర్ పాత్ర‌లతో పాటూ పాత్ర ప్ర‌ధానమైన సినిమాల్లోనూ న‌టించి ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ భ‌క్తి గీతంతో మ‌రోసారి ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకున్న రాశీ, యాక్టింగ్ తోనే కాదు, స్వ‌రంతో కూడా హృద‌యాల్ని గెలుచుకోవ‌చ్చ‌ని నిరూపించారు.

ప‌లు భాష‌ల్లో బిజీబిజీగా రాశీ

ప్ర‌స్తుతం రాశీ ప‌లు భాష‌ల్లో బిజీగా ఉన్నారు. తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఆమె న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఫ‌ర్జీ సెకండ్ పార్ట్ లో కూడా రాశీ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ లో త‌న స్థానాన్ని మ‌రింత స్ట్రాంగ్ చేసుకునే దిశ‌గా రాశీ అడుగులేస్తున్నారు. ఓ వైపు హీరోయిన్ గా స‌త్తా చాటుతూనే, మ‌రోవైపు సింగ‌ర్ గా కూడా స‌త్తా చాటుతూ మ‌ల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా ఇండ‌స్ట్రీలో రాణిస్తున్నారు.