గ్లామర్ వెనుక అసలైన కష్టం.. తెర వెనుక ఫ్యాక్ట్ బయటపెట్టిన రాశి సింగ్ !
అంతేకాదు రంభ పాత్రకు సంబంధించిన గ్లామర్ లుక్ ను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేసింది.
By: Madhu Reddy | 10 Sept 2026 12:00 AM ISTచిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తిని పెంచుకున్న ప్రముఖ బ్యూటీ రాశి సింగ్ కి.. 14 ఏళ్ల వయసులోనే ఒక కమర్షియల్ యాడ్ లో అవకాశం వచ్చినా. వ్యక్తిగత కారణాల వల్ల వదులుకుంది. చదువు పూర్తి చేసుకున్న ఈమె తొలిసారి ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టేస్ గా కెరియర్ ప్రారంభించింది. ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉన్న సమయంలోనే 2019లో జెమ్ అనే తెలుగు చిత్రంతో నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పోస్టర్, ప్రసన్న వదనం, బ్లైండ్ స్పాట్ , సంతాన ప్రాప్తిరస్తు, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఇలా పలు చిత్రాలు చేసింది. కానీ ఏవి కూడా ఈమెకు అనుకునేంత స్థాయిలో గుర్తింపును అందివ్వలేదు.
రంభాషీగా రాశి సింగ్..
కానీ రీసెంట్గా అల్లరి నరేష్ హీరోగా వచ్చిన రంభ ఊర్వశి మేనక చిత్రంలో రంభ పాత్రతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది రాశి సింగ్. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా.. ఇందులో ఆమె నటన అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె గ్లామర్ కుర్రకారుకు మంచి ట్రీట్ ఇచ్చింది. అంతేకాదు రంభ పాత్రకు సంబంధించిన గ్లామర్ లుక్ ను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేసింది. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా రంభ పాత్రలో రాశి సింగ్ మాత్రం మంచి పేరు దక్కించుకుంది.
గ్లామర్ వెనుక అసలైన కష్టం..
ముఖ్యంగా ఈ సినిమాలో రంభ పాత్రతో గ్లామర్ హంగులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఇంత అందంగా కనిపించడం వెనుక తాను పడ్డ కష్టాన్ని అభిమానులతో ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. గ్లామర్ వెనుక తాను పడ్డ కష్టం ఇదే అంటూ ఆ ఫోటోలను క్యాప్షన్ కూడా జోడించింది. రాశి సింగ్ ఈ ఫోటోలను షేర్ చేస్తూ.." మీరు తెరపై చూసేది అందం, ఆకర్షణ మాత్రమే. కానీ దానిని నిలబెట్టుకోవడానికి పడే కష్టం మీకు కనిపించదు. సరైన ఆహారం తీసుకోవడం, నా శరీరాన్ని, చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం.. ఫిట్గా ఉండడం, చల్లని రాత్రులలో, అర్ధరాత్రి వేళల్లో షూటింగ్ చేయడం, ఒళ్ళు నొప్పులు భరించడం.. అయినా కూడా ప్రదర్శన ఇవ్వడానికి తగినంత శక్తిని కలిగి ఉండడం.. అలాగే నన్ను రంబాషి అని పిలిచిన వాళ్లందరూ గెలిచారు. నేను ఆ పేరు నే ఉంచుకుంటాను. ఈ లుక్కును, నన్ను హ్యాండిల్ చేసిన నా టీం కి ప్రత్యేక ధన్యవాదాలు" అంటూ తెర వెనుక ఆ పాత్ర కోసం ఆమె పడ్డ కష్టాన్ని అభిమానులతో పంచుకుంది.
తెర వెనుక కష్టాలను పంచుకున్న రాశి సింగ్..
ముఖ్యంగా రంభ పాత్ర కోసం ఆమె రెడీ అవుతున్న ఫోటోలను అలాగే నిప్పులతో చేతులను కాచుకుంటున్నట్టు ఇలా కొన్ని ఫోటోలను ఆమె షేర్ చేశారు . ఏదేమైనా సెలబ్రిటీలు మనకు వినోదాన్ని పంచుతున్నారు అంటే.. తెర వెనుక వారు పడే కష్టం ఎలా ఉంటుందో చెప్పడం వర్ణనాతీతం. ప్రస్తుతం రాశి సింగ్ షేర్ చేసిన ఫోటోలు, పంచుకున్న క్యాప్షన్ అభిమానులలో, నెటిజన్స్ లో సెలబ్రిటీస్ పై మరింత గౌరవాన్ని పెంచుతున్నాయి.
