భయంతో బంపర్ ఆఫర్ వదులకున్న రాశి!
ఒకప్పుడు వెండి తెరుపై ఓ వెలుగు వెలిగిన అందాల రాశీ గురించి పరిచయం అవసరం లేదు. శ్రీకాంత్, జగపతి బాబు లాంటి స్టార్లతో ఎన్నో ఫ్యామిలీ కంటెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటి.
By: Srikanth Kontham | 22 Sept 2025 6:00 AM ISTఒకప్పుడు వెండి తెరుపై ఓ వెలుగు వెలిగిన అందాల రాశీ గురించి పరిచయం అవసరం లేదు. శ్రీకాంత్, జగపతి బాబు లాంటి స్టార్లతో ఎన్నో ఫ్యామిలీ కంటెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటి. అప్పటి కథల్లో హీరోకి ధీటుగా ఆమె పాత్ర హైలైట్ అయ్యేది. ప్రత్యేకించి ఆమె అందానికే ఎంతో మంది అభిమా నులుండేవారు. రాశీ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుందంటే థియేటర్ ముందు క్యూ కట్టేవారు. అలాంటి రాశి పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. కుటుంబం, పిల్లలు అంటూ ఆ బిజీలో పడిపోయారు.
అనసూయ కంటే అద్భుతంగా:
ఆ తర్వాత కొంత కాలానికి మళ్లీ కంబ్యాక్ అయ్యారు గానీ పెద్దగా అవకాశాలు రావడం లేదు. అప్పుడప్పుడు వెండి తెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తున్నారు. అయితే రాశీ ఓ గొప్ప అవకాశాన్ని చేతులారా వదులుకున్నట్లు తెలిపారు. రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన `రంగస్థలం` ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అందులో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర హైలైట్ గా నిలిచింది. ఆపాత్రకు అనసూయని సుకుమార్ ఏరికోరి మరీ తీసు కున్నార ని అప్పట్లో చెప్పుకునే వారు. అనసూయ డిమాండ్ చేసినంత పారితోషికం చెల్లించి మరీ తెచ్చుకున్నట్లు నెట్టింట వైరల్ అయింది.
రంగమ్మత్త ఛాన్స్ మిస్:
ఆ ప్రచారానికి తగ్గట్టు సినిమాలో ఆ పాత్ర అంతే అద్భుతంగా పండింది. అయితే ఇదే రోల్ ముందుగా రాశీకే వచ్చింది అన్న విషయాన్ని రాశీ తాజాగా రివీల్ చేసారు. అలా వచ్చిన అవకాశాన్ని తానే సున్నితంగా తిరస్కరిం చినటు తెలిపారు. ఎందుకంటే? ఆ పాత్రలో ప్రేక్షకులు తనను అంగీకరిస్తారో? లేదో? అన్న భయంతోనే వచ్చిన అవకాశాన్ని వదులుకున్నట్లు తెలిపారు. ఈ పాత్రకు రాశీ పర్పెక్ట్ గా సూటవుతారు. ఆమె అందం, అభినయం పాత్రకు అన్ని రకాలుగా సరితూగుతుంది. ఈపాత్ర రాశీ గనుక పోషించి ఉంటే? ఇంకా గొప్ప రీచ్ దక్కేది.
కానీ జనాలకు భయపడి రాశీ ధైర్యంగా ముందడుగు వేయలేకపోయారు.
సీనియర్లకు పెరిగిన ప్రాధాన్యత:
ఒకవేళ ఆ ఛాన్స్ వినియోగించుకున్నట్లు అయితే రాశీ సెకెండ్ ఇన్నింగ్స్ మారిపోయేది. నటిగా మరింత బిజీ అయ్యేవారు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలకు రాశీ మంచి ఆప్షన్ అయ్యేవారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లు అంతా హీరోలకు అమ్మ పాత్రలకు, కీలక పాత్రలకు రిటైర్ అయిన నటీమణుల్నే వెతికి మరీ తీసుకొస్తున్నారు. విదేశాల్లో ఎక్కడున్నా జల్లెడ వేసి మరీ తెస్తున్నారు. అప్పటి నటీమమణులు ఆ పాత్రాల్లో కనిపిస్తే ప్రేక్షకులకు ప్రెష్ ఫీలింగ్ ఇచ్చినట్లు అవుతుందని సీనియర్లను దించుతున్నారు. త్రివిక్రమ్, అనీల్ రావిపూడి, బాబి, గోపీచంద్ మలినేని లాంటి వారు సీనియర్లకు మంచి ప్రాధాన్యత ఇస్తోన్న సంగతి తెలిసిందే.
