ఒకే ఒక్కడు కోసం కథ వినకుండా రాశీఖన్నా!
దాదాపు మూడేళ్ల తర్వాత అందాల రాశీఖన్నా టాలీవుడ్ లో కంబ్యాక్ అవుతుంది. 'తెలుసుకదా 'అనే చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించబోతుంది.
By: Srikanth Kontham | 2 Oct 2025 6:00 PM ISTదాదాపు మూడేళ్ల తర్వాత అందాల రాశీఖన్నా టాలీవుడ్ లో కంబ్యాక్ అవుతుంది. `తెలుసుకదా `అనే చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. 'పక్కా కమర్శియల్', 'థాంక్యూ' తర్వాత ఒక్కసారిగా అమ్మడు టాలీవుడ్ కి దూరమైంది. మధ్యలో ప్రయాణమంతా కోలీవుడ్ లోనే సాగింది. సక్సస్ లేకుండా టాలీవుడ్ లో రాశీఖన్నాకి వచ్చినన్ని అవకాశాలు మరే నటికి వచ్చి ఉండవేమో. ఆ విషయంలో ఎంతో లక్కీ గాళ్. కానీ అలాంటి ప్రయాణం ఎంత కాలం సాగుతుంది అన్నట్లు మూడేళ్లు గ్యాప్ తప్పలేదు. `తెలుసుకదా` తో గ్రాండ్ విక్టరీ కొట్టబోతుందని అంచనాలున్నాయి.
ఒకవేళ ఆ సినిమా ఫలితం అటు ఇటు అయినా మరేం ప్రాబ్లమ్ లేదంటోంది. అవును చేతిలో `ఉస్తాద్ భగత్ సింగ్` కూడా సిద్దంగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లోకి రాశీఖన్నా వచ్చిందంటే తానెంత అదృష్టవంతురాలో చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ సినిమాకు అమ్మడు ఎంపిక ఎలా జరిగిందంటే? కనీసం కథ కూడా వినకుండా ప్రాజెక్ట్ కు ఒకే చెప్పినట్లు రాశీఖన్నా తెలిపింది.
'ఓరోజు హరీష్ శంకర్ పోన్ చేసి పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ ఉంది? చేస్తారా? అంటే మరో ఆలోచన లేకుండా ఎస్ చెప్పింది. రాశీఖన్నా తొలిసారి కథ వినకుండా ఒకే చేసిన తొలి చిత్రంగా పేర్కొంది. ఇంత వరకూ ఏ సినిమాకు రాశీ ఇలా కమిట్ అవ్వలేదు. కానీ తెలుగు పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తో నటించాలనే కోరిక ఉండేదని..రాక రాక వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదలుకోవడం అని కథ కూడా కూడా వినకుండా ఒకే చేసినట్లు తెలిపింది. ఈ సినిమా పవన్ అభిమానులకు ఓ విందు భోజనంలా ఉంటుందని పేర్కొంది.
పవన్ తో కలిసి పని చేస్తున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది? అన్నది మరింతగా అర్దమైందని తెలిపింది. ఇప్పటికే పవన్ పాత్రకు సంబంధించి చిత్రీకరణ పూర్తయిందని..తన పాత్రకు సంబంధించి కొంత భాగం షూటింగ్ చేయాల్సి ఉందంది. పవన్ కళ్యాణ్ పేరుకు తగ్గట్టే చాలా పవర్ పుల్ అని తెలిపింది.
