Begin typing your search above and press return to search.

మేక‌ప్ ఆర్టిస్ట్ తో రోడ్డు ప‌క్క‌న రాశీ కుస్తీలు

తాజాగా ఈ విష‌యం హీరోయిన్ రాశీ ఖ‌న్నా చేసిన పోస్ట్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. రాఖీ ఖ‌న్నా తాజాగా రోడ్డు ప‌క్క‌నే మేక‌ప్ చేసుకుంటున్న‌ట్టు ఓ వీడియోను పోస్ట్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   29 July 2025 4:49 PM IST
మేక‌ప్ ఆర్టిస్ట్ తో రోడ్డు ప‌క్క‌న రాశీ కుస్తీలు
X

ఎప్పుడూ గ్లామ‌ర‌స్ గా క‌నిపిస్తూ ఉంటారు, మంచి మంచి డిజైన‌ర్ దుస్తులు వేసుకుంటారు. ఖ‌రీదైన కార్ల‌లో తిరుగుతారు. హీరోయిన్ల లైఫ్ కు ఏమిలే వారి ప‌నే హాయిగా ఉంటుందనుకుంటారు అంద‌రూ. కానీ లైఫ్ లో వృత్తిరీత్యా ఎవ‌రికి ఉండే టెన్ష‌న్స్ వారికి ఉంటాయి. వారిక్కూడా సాధార‌ణ వ్య‌క్తుల్లానే లాస్ట్ మినిట్ టెన్ష‌న్స్, ఉరుకుల ప‌రుగుల జీవితం ఉంటుంది.


ఇన్‌స్టాలో రాశీ పోస్ట్ వైర‌ల్

తాజాగా ఈ విష‌యం హీరోయిన్ రాశీ ఖ‌న్నా చేసిన పోస్ట్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. రాఖీ ఖ‌న్నా తాజాగా రోడ్డు ప‌క్క‌నే మేక‌ప్ చేసుకుంటున్న‌ట్టు ఓ వీడియోను పోస్ట్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ప్ర‌స్తుతం కాస్ట్యూమ్ డిజైన‌ర్ నీర‌జ కోన ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధు జొన్న‌లగ‌డ్డ హీరోగా తెర‌కెక్కుతున్న తెలుసు క‌దా అనే సినిమాలో రాశీ హీరోయిన్ గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.


రోడ్డు ప‌క్క‌న ఆగి మేక‌ప్

రాశీ షేర్ చేసిన వీడియోలో ఆమె పార్క్ చేసిన కారులో కూర్చుని ఉండ‌గా, ఆ కారు రోడ్డు ప‌క్క‌కి పార్క్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. మేక‌ప్ కు కావాల్సినంత టైమ్ లేక రోడ్డు ప‌క్క‌నే ఆగి రాశీ త‌న మేక‌ప్ ఆర్టిస్టుతో ట‌చప్స్ చేయించుకుంటూ క‌నిపించారు. దీన్ని బ‌ట్టి చూస్తుంటే ఆర్టిస్టుల షెడ్యూల్ ఊహించ‌ని ప్ర‌దేశాల్లో ఎలాంటి ప‌నులు చేయాల్సి వ‌స్తుందో అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే ఆ వీడియోను చూసిన నెటిజ‌న్లు రాశీ ద‌గ్గ‌ర చాలా మంచి మేక‌ప్ ఆర్టిస్ట్ ఉన్నార‌ని, లొకేష‌న్ ను ప‌ట్టించుకోకుండా ఆమె రాశీకి చాలా శ్ర‌ద్ధ‌గా మేక‌ప్ చేస్తున్నార‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను పోస్ట్ చేస్తూ రాశీ ఖ‌న్నా జ‌ర్నీలో ట‌చప్‌లు అంటూ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే రాశీ షేర్ చేసిన‌ ఈ వీడియో చాలా మందిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

స్క్రీన్ పై ఎప్పుడూ గ్లామ‌ర‌స్ గా క‌నిపించే హీరోయిన్ల గ్లామ‌ర్ వెనుక ఇంత క‌ష్ట‌ముంటుందా అని కొంద‌రంటుంటే, మ‌రికొంద‌రు అంద‌రిలానే హీరోయిన్ల లైఫ్ లో కూడా హ‌డావిడి, లాస్ట్ మినిట్ ఛేంజెస్ ఉంటాయ‌ని అంటున్నారు. ఇక రాశీ కెరీర్ విషయానికొస్తే ఊహ‌లు గుస‌గుసలాడే సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన రాశీ తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ప్ర‌స్తుతం రాశీ తెలుసు క‌దా సినిమాలో న‌టిస్తుండ‌గా, రీసెంట్ గానే ఆ సినిమా నుంచి మ‌ల్లికా గాంధ అనే లిరిక‌ల్ సాంగ్ రిలీజైంది. త‌మ‌న్ కంపోజిష‌న్ లో వ‌చ్చిన ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.