ఫోటో స్టోరి: చందనపు బొమ్మ కుందనపు కొమ్మ
టాలీవుడ్ లో దశాబ్ధం పైగానే కెరీర్ ని విజయవంతంగా నడిపించింది రాశీ ఖన్నా. యువహీరోలతో పాటు స్టార్ హీరోలు ఈ భామకు అవకాశాలు కల్పించారు.
By: Sivaji Kontham | 6 Nov 2025 12:00 AM ISTటాలీవుడ్ లో దశాబ్ధం పైగానే కెరీర్ ని విజయవంతంగా నడిపించింది రాశీ ఖన్నా. యువహీరోలతో పాటు స్టార్ హీరోలు ఈ భామకు అవకాశాలు కల్పించారు. మలయాళం, కన్నడ భామల నుంచి పోటీ ఎంతగా ఉన్నా ఈ దిల్లీ బ్యూటీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడంలో సఫలమైంది. ఇంతకుముందు రాజ్ అండ్ డీకే `ఫర్జీ`లో నటించింది. వెబ్ సిరీస్ లతోను రాశీ ఖన్నా చక్కని గుర్తింపు తెచ్చుకుంది.
2024లో నాలుగు సినిమాల్లో నటించిన రాశీ ఖన్నా ఈ ఏడాది మరో నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో రాశీ చెప్పుకోదగ్గ పాత్రలో నటిస్తోంది. బ్రిడ్జ్, తలాఖోన్ మే ఏక్, 120 బహదూర్ లాంటి హిందీ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ఇటీవలే తెలుసు కదా? అనే చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చింది. తదుపరి టాలీవుడ్ లో ఏ చిత్రానికి సంతకం చేసిందో తెలియాల్సి ఉంది.
మరోవైపు రాశీఖన్నా వరుస ఫోటోషూట్లతో ఇంటర్నెట్‌లో అగ్గి రాజేస్తోంది. మరోసారి క్లాసీ అనదగ్గ డిజైనర్ లుక్ లో మతులు చెడగొడుతోంది రాశీ. చూడగానే `కుందనపు బొమ్మ` అని పొగిడేస్తున్నారు బోయ్స్. రాశీ అందమైన స్మైలీ ఫేస్ తో కెమెరా ముందు హొయలుపోతున్న తీరు ఆకట్టుకుంటోంది. క్రీమ్ కలర్ డిజైనర్ శారీ, కాంబినేషన్ బ్లౌజ్ తో పాటు చీర బార్డర్ ఎంతో అందంగా, ఒద్దికగా రాశీ కోసమే డిజైన్ చేసారా? అనేంతగా కుదిరింది. ప్రస్తుతం ఈ కొత్త లుక్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
