Begin typing your search above and press return to search.

ఈ స్టార్ కిడ్ కి టాలీవుడ్ లో ఆఫర్స్ ఇంక కష్టమేనా?

ఇండస్ట్రీ లోకి రావడానికి పెద్దగా కష్టం ఉండదు. తల్లిదండ్రుల బ్యాక్ గ్రౌండ్ ను ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి ఈజీగా అడుగు పెడతారు .

By:  Madhu Reddy   |   16 Sept 2026 4:00 PM IST
ఈ స్టార్ కిడ్ కి టాలీవుడ్ లో ఆఫర్స్ ఇంక కష్టమేనా?
X

ఈ మధ్యకాలంలో తెలుగు, తమిళ్ , కన్నడ ,హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా ఎక్కడ మంచి కంటెంట్ దొరికి.. అవకాశం లభిస్తే ఖచ్చితంగా ఆ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరించడమే కాకుండా తమకంటూ ఇండస్ట్రీలో ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇండస్ట్రీ లోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టే వారికి అవకాశం లభించే వరకు చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ అవకాశం లభించి వారు సత్తా చాటారు అంటే. మిగతా భాషలలో అవకాశాలు అందుకోవడానికి మార్గం సులభం అవుతుంది. అయితే ఇక్కడ ప్రత్యేకించి స్టార్ కిడ్స్ గురించి చెప్పుకోవాలి.





ఇండస్ట్రీ లోకి రావడానికి పెద్దగా కష్టం ఉండదు. తల్లిదండ్రుల బ్యాక్ గ్రౌండ్ ను ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి ఈజీగా అడుగు పెడతారు . కానీ ఆ తర్వాత వారు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారా? లేదా? అన్నది పూర్తిగా వారి టాలెంట్ పైన, అలాగే కథల ఎంపికపైనే ఉంటుంది. ఇప్పటికే కొంతమంది స్టార్ కిడ్స్ కుటుంబ బ్యాక్ గ్రౌండ్ ను ఉపయోగించుకొని.. ఇండస్ట్రీలోకి వచ్చి, ఆ తర్వాత తమ సొంత టాలెంట్ తో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటే.. మరికొంతమంది టాలెంటును ప్రూవ్ చేసుకోలేక, అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉన్నారు.





అలాంటి వారిలో రాషా తడానీ కూడా ఒకరు. ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్, సినిమా డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ దంపతుల కుమార్తె ఈమె. తొలిసారి తన తల్లిదండ్రుల బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించుకొని హిందీలో ఆజాద్ అనే చిత్రంతో అరంగేట్రం చేసింది . ఇందులో అజయ్ దేవగన్, అమన్ దేవగన్, డయానా పెంటి వంటి తారలు కీలక పాత్రలు పోషించారు.ఈ చిత్రం తర్వాత తెలుగులో శ్రీనివాస మంగాపురం అనే సినిమా చేసింది. పైగా ఈ సినిమాలో దివంగత నటుడు కృష్ణ వారసుడు జయకృష్ణ కూడా తొలి పరిచయంలో ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇందులో ఇద్దరి నటన బాగున్నప్పటికీ సినిమాలో సోల్ లేకపోవడం వల్ల ప్రేక్షకులు ఆదరించలేకపోయారు.





మొదటి సినిమానే డిజాస్టర్ గా నిలవడంతో మళ్లీ రాషాకి మరో ప్రాజెక్ట్ లో అవకాశం లభించలేదు. మరి నిజంగానే ఈమెకు అవకాశాలు రావట్లేదా? లేక ఇక్కడ మొదటి సినిమానే డిజాస్టర్ గా నిలవడంతో బాలీవుడ్ వైపే చూస్తోందా అన్న కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది కుర్ర హీరోయిన్లు తమ అద్భుతమైన నటనతో దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో రాషా తడానీకి మళ్లీ తెలుగులో అవకాశం లభించడం కష్టమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.





మొత్తానికైతే ఇండస్ట్రీ ఎంట్రీకి బ్యాక్ గ్రౌండ్ ఉపయోగపడినప్పటికీ.. తర్వాత అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఈమె వెనుక పడ్డారనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి మునుముందు అయినా జాగ్రత్తగా కథల ఎంపికతో ఇండస్ట్రీలో మళ్లీ అవకాశం దక్కించుకుంటుందేమో చూడాలి.