యువనటితో తమన్నా స్నేహం ఎందాకా?
కేజీఎఫ్, ఆర్.ఆర్.ఆర్ సినిమా మొదలు చాలా దక్షిణాది సినిమాలను హిందీ బెల్ట్ లో రిలీజ్ చేసిన ప్రముఖులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
By: Sivaji Kontham | 23 Oct 2025 5:00 AM ISTబాలీవుడ్ లో దిగ్గజ పంపిణీదారులుగా పాపులరయ్యారు తడానీలు. కేజీఎఫ్, ఆర్.ఆర్.ఆర్ సినిమా మొదలు చాలా దక్షిణాది సినిమాలను హిందీ బెల్ట్ లో రిలీజ్ చేసిన ప్రముఖులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కరణ్ జోహార్ లాంటి దిగ్గజ పంపిణీదారు రేసులో ఉన్నా ఇండస్ట్రీని శాసిస్తున్న పంపిణీ వ్యవస్థ తడానీ గ్రూప్ కి ఉంది.
అందుకే ఇప్పుడు తడానీ గ్రూప్ అధినేత్రి, మేటి కథానాయిక రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ సినీరంగ ప్రవేశం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. స్టార్ హీరో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ సరసన ఆజాద్ అనే చిత్రంలో రాషా కథానాయికగా నటించింది. రాషా మొదటి ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తదుపరి రాషా తడానీ వరుస చిత్రాలకు కమిటవుతోంది.
ఇప్పుడు రాషా తడానీ స్నేహితుల మధ్యలో ఒక స్పెషల్ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ స్పెషల్ గాళ్ మరెవరో కాదు తమన్నా భాటియా. నిరంతరం తడానీ ఫ్యామిలీ సభ్యులతో అత్యంత సన్నిహితంగా మెలగుతోంది తమన్నా. ఇప్పుడు రాషా తడానీతో కలిసి రెస్టారెంట్ లో పార్టీకి రెడీ అయిపోయింది. రకరకాల వెరైటీలను ఆరగిస్తూ రాషాతో కలిసి ఆటలు ఆడుకుంటున్న ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. అంతేకాదండోయ్.. పార్టీలో వైన్ సేవిస్తూ, నచ్చిన ఫుడ్ తింటూ రాషా తడానీ సందడి చేస్తుంటే, ఆ పక్కనే ఉన్న తమన్నా కూడా పార్టీలో మునిగిపోయింది. మొత్తానికి నైట్ పార్టీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ పార్టీ నుంచి ఫోటోలు, వీడియోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, తమన్నా తదుపరి వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రాషా తడానీ యువహీరోల సరసన కొన్ని ఆసక్తికర చిత్రాలకు సంతకాలు చేసింది. రాషా తడానీ తదుపరి నందమూరి నటసింహం బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ డెబ్యూ చిత్రంలో నటిస్తుందని కూడా కథనాలొచ్చాయి.
