Begin typing your search above and press return to search.

తెలుగు డెబ్యూపై చాలా హోప్స్ పెట్టుకున్న నేపో కిడ్

తన మొదటి తెలుగు సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి రాషా థడాని కూడా అంతే నిజాయితీగా కృషి చేస్తోంది.

By:  Sivaji Kontham   |   11 July 2026 10:24 AM IST
తెలుగు డెబ్యూపై చాలా హోప్స్ పెట్టుకున్న నేపో కిడ్
X

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాషా థడాని తన టాలీవుడ్ ఎంట్రీపై కొండంత ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ `నెపో కిడ్` రాషా టాలీవుడ్ డెబ్యూ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఘట్టమనేని వారసుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న `శ్రీనివాస మంగాపురం` చిత్రంలో రాషా థడాని హీరోయిన్‌గా నటిస్తోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.

రాషా థడాని కేవలం తన నటనతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 31 లక్షల మంది (3.1M) ఫాలోవర్స్ ఉన్నారు. విశేషం ఏమిటంటే..ఈ ఫాలోవర్లలో ఎక్కువ మంది ఘట్టమనేని అభిమానులే కావడం గమనార్హం. జయకృష్ణ ఘట్టమనేని సరసన నటిస్తుండటంతో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానుల హృద‌యాల‌లో ఈ ఉత్తరాది భామ తిష్ఠ వేసింది. ఘట్టమనేని ఫ్యాన్స్ ఇప్పుడు రాషా థడానిని..త‌న‌ సినిమాను సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ప్రమోట్ చేస్తూ సపోర్ట్ అందిస్తున్నారు.

తన మొదటి తెలుగు సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి రాషా థడాని కూడా అంతే నిజాయితీగా కృషి చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నిరంత‌రం సినిమా అప్‌డేట్స్‌తో పాటు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రమోట్ చేస్తోంది. ఈ ఫోటోలకు తెలుగు ఆడియన్స్ నుండి... ముఖ్యంగా ఘట్టమనేని అభిమానుల నుండి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఒకప్పటి గ్లామర్ క్వీన్ అయిన తన తల్లి రవీనా టాండన్‌ను మించిన అందం రాషా సొంతమంటూ నెటిజన్లు త‌న‌ ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇక రాషా థడాని నటిస్తున్న బాలీవుడ్ డెబ్యూ చిత్రం విషయానికి వస్తే.. అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ సరసన `ఆజాద్` ఒక భారీ చిత్రంలో నటించింది. ఈ సినిమాలోని పాటల్లో రాషా థడాని డ్యాన్సులు అందరినీ మురిపించాయి. ఒకప్పటి మేటి నటి అయిన తన తల్లి రవీనా టాండన్ రేంజ్‌లో రాషా ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టిందని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపించింది. నటనలోనే కాదు డ్యాన్స్‌లోనూ తల్లికి తగ్గ త‌న‌య‌ అనిపించుకుంటూ రాషా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.

ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ సరసన `బంగారు బుల్లోడు` వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు రవీనా టాండన్ బాగా దగ్గరయ్యారు. బాలీవుడ్‌లోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రవీనా అందచందాలకు, డ్యాన్సింగ్ టాలెంట్‌కు ఫిదా కాని సినీ అభిమాని లేడు. ఇప్పుడు సరిగ్గా అదే తీరుగా ర‌వీనా కుమార్తె రాషా థడాని కూడా తన అద్భుతమైన నటన, డ్యాన్స్, గ్లామర్‌తో వారసత్వాన్ని వందకు వంద శాతం నిలబెడుతుందని టాలీవుడ్ అభిమానులు ఆశిస్తున్నారు. శ్రీ‌నివాస మంగాపురం చిత్రంలోని రాషా త‌డానీ లుక్ కి ఇప్ప‌టికే ప్ర‌శంస‌లు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే.