Begin typing your search above and press return to search.

RAPO 23: ఫ్రెండ్ తో రామ్ 'ఢీ'.. ఇది కదా సరైన కాంబో!

రామ్ పోతినేని హీరోగా నటిస్తూనే RAPO23 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన కెరీర్‌ లోనే కొత్తగా ఉండే స్టోరీతో రూపొందిస్తున్నారు.

By:  M Prashanth   |   19 Oct 2026 11:53 AM IST
RAPO 23: ఫ్రెండ్ తో రామ్ ఢీ.. ఇది కదా సరైన కాంబో!
X

హీరోగా ప్రేక్షకులను ఇప్పటికే అలరించిన రామ్ పోతినేని.. ఇప్పుడు దర్శకుడిగా కొత్త జర్నీ మొదలుపెట్టారు. తన డైరక్షన్ డెబ్యూ మూవీతో బాలీవుడ్ నటుడిని టాలీవుడ్‌ కు తీసుకొస్తున్నారు. ఆయనే రితేష్ దేశ్‌ముఖ్. రామ్, రితేష్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కావడం.. ఇప్పుడు వీరిద్దరూ ఒకే సినిమా కోసం కలిసి పనిచేస్తుండటంతో RAPO23పై హైప్ పెరుగుతోంది.

రామ్ పోతినేని హీరోగా నటిస్తూనే RAPO23 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన కెరీర్‌ లోనే కొత్తగా ఉండే స్టోరీతో రూపొందిస్తున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ గా, నియో నాయర్ స్టైల్ లో ఆ మూవీ రూపొందుతోంది. ఇలాంటి స్టోరీకి స్ట్రాంగ్ క్యాస్టింగ్ అవసరం. అందుకే రామ్ తన పాత్రతో పాటు మిగతా రోల్స్ సెలక్షన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రితేష్ ను కీలక పాత్రకు తీసుకున్నారు.

రితేష్‌ కు హిందీలో మంచి గుర్తింపు ఉంది. ఏక్ విలన్, రైడ్ 2, రాజా శివాజీ వంటి సినిమాలతో విభిన్న పాత్రల్లో యాక్టింగ్ ను చూపించారు. ముఖ్యంగా విలన్ రోల్స్ కూడా తనదైన ముద్ర వేయగలరని నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆయన తెలుగులోకి అడుగుపెడుతూ రామ్‌ తో కలిసి నటిస్తున్నారు. సినిమాలో రితేష్ రోల్ కు మంచి స్కోప్ ఉందని మూవీ టీమ్ చెప్పింది. స్టోరీ అండ్ రోల్ నచ్చడంతోనే ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం హైదరాబాద్‌ లో ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా, రీసెంట్ గా రితేష్ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా మూవీ టీమ్ రిలీజ్ చేసింది. అందులో రితేష్ సెట్‌లోకి వస్తుండగా రామ్ ఆయనకు వెల్కమ్ చెప్పి హత్తుకున్నారు. వీడియోలో రితేష్ ఫేస్ ను కంప్లీట్ గా చూపించకపోయినా.. రామ్‌ తో ఆయన కలిసి పనిచేస్తున్న విషయం క్లియర్ గా తెలుస్తోంది.

రామ్‌ కు రితేష్ దేశ్ ముఖ్ మంచి ఫ్రెండ్ కావడం ఆ కాంబోలో మరో స్పెషాలిటీ. సాధారణంగా హీరోగా కనిపించే రామ్.. ఈసారి దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. తనకు పరిచయం ఉన్న నటుడితోనే తొలి సినిమా చేయడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మారింది. అయితే ఫ్రెండ్ షిప్ ఒకవైపు ఉంటే.. స్క్రీన్ పై ఇద్దరి రోల్స్ మధ్య ఎలాంటి ఢీ ఉంటుందనేది మరో విషయం.

ఇక మూవీలో రామ్ సరసన సంయుక్త హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరునావుకరసు (తిర్రు) కెమెరా బాధ్యతలు చూస్తున్నారు. సంగీతాన్ని సామ్ సీఎస్ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌ గా వ్యవహరిస్తుండగా.. పీటర్ హెయిన్, విక్రమ్ మోర్, కెవిన్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. కృష్ణ పోతినేని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పుడు రామ్, రితేష్ కాంబో ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.