Rao Ramesh: ప్రతి సినిమా ఈవెంట్లో ఏదో ఒకటి వైరల్ లేదా కామెడీగా మాట్లాడాల్సిందేనా..!
సినిమా ఈవెంట్లలో మాట్లాడే మాటలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయి ఎన్నో కామెంట్లు తెచ్చుకుంటున్నాయి.
By: Priya Chowdhary Nuthalapti | 30 Oct 2026 10:40 PM ISTసినిమా ఈవెంట్లలో మాట్లాడే మాటలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయి ఎన్నో కామెంట్లు తెచ్చుకుంటున్నాయి. ఒకప్పుడు సినిమా గురించి, నటీనటుల గురించి, సినిమా అనుభవాల గురించి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఈవెంట్లో ఏదో ఒక మాట వైరల్ కావాలనే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా నటుడు రావు రమేష్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.
ఆదర్శ కుటుంబం సినిమా సక్సెస్ ఈవెంట్లో పాల్గొన్న రావు రమేష్ తనదైన శైలిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత స్టేజ్ మీద మాట్లాడుతున్నానని చెప్పిన ఆయన, ఈ రోజుల్లో సినిమా ఈవెంట్లలో మాట్లాడటం కూడా ఒక పెద్ద టాస్క్‌లా మారిపోయిందని సరదాగా అన్నారు.
"ఈ రోజుల్లో స్టేజ్ మీద మాట్లాడాలంటే ఏదో ఒకటి వైరల్ అయ్యేలా మాట్లాడాలి. లేదంటే కామెడీగా మాట్లాడాలి. హుందాగా, మామూలుగా మాట్లాడితే .. ఇప్పుడు కష్టం. ఏదో ఒకటి వైరల్ కావాలి లేదా అందరినీ నవ్వించాలి" అని రావు రమేష్ అన్నారు.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. నిజంగానే సినిమా ఈవెంట్లలో మాట్లాడే మాటలకు ఈ మధ్య ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. ఒక హీరో లేదా నటుడు ఏదైనా ఫన్నీగా మాట్లాడినా, చిన్న వివాదాస్పద వ్యాఖ్య చేసినా వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబ్‌లో ఆ వీడియోలకు ప్రత్యేకంగా వ్యూస్ వస్తున్నాయి. దీంతో కొందరు సెలబ్రిటీలు కూడా తమ ప్రసంగాల్లో కొన్ని వైరల్ మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం ఉంది.
అయితే ప్రతి ఈవెంట్లోనూ వైరల్ అయ్యేలా మాట్లాడాల్సిన అవసరం ఉందా.. సినిమా గురించి మనసులో ఉన్న మాటలను సహజంగా చెప్పినా ప్రేక్షకులు వినరా..అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా రావడమే చెప్పిన మాటల్లో అబద్ధం అయితే లేదు.
ఇక ఇదే కార్యక్రమంలో రావు రమేష్ వెంకటేష్‌పై తనకున్న అభిమానాన్ని కూడా వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే తనకు మంచి డైలాగ్ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
"ప్రింట్లో లేని గొప్ప పుస్తకాన్ని నేను" అనే డైలాగ్ ప్రతి ఒక్కరి జీవితానికి సరిపోతుందని రావు రమేష్ వివరించారు. ప్రతి మనిషి జీవితం ఒక పుస్తకం లాంటిదని, దాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పారు.
