రావు బహదూర్ టీజర్.. 'మహా' అద్భుతం..!
ఏదైనా సినిమా మీద ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసేదే టీజర్. ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఆడియన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తే సినిమా కోసం వాళ్లే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేలా వెయిట్ చేస్తారు.
By: Ramesh Boddu | 18 Aug 2025 12:27 PM ISTఏదైనా సినిమా మీద ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసేదే టీజర్. ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఆడియన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తే సినిమా కోసం వాళ్లే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేలా వెయిట్ చేస్తారు. ఐతే కమర్షియల్ సినిమాల్లో ఈ లెక్కలు ఎలా ఉన్నా ఒక ఎక్స్ పెరిమెంట్ సినిమాకు మాత్రం టీజరే మ్యాజిక్ చేస్తుంది. అలా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా వచ్చిన టీజర్ రావు బహదూర్. వెంకటేష్ మహా డైరెక్షన్ లో సత్యదేవ్ నటిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజైంది.
టీజర్ ఎగ్జైట్మెంట్..
ఈ టీజర్ చూస్తేనే ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అన్నంత ఎగ్జైట్మెంట్ కలిగింది. ఇంతకీ టీజర్ విషయానికి వస్తే ఒక పెద్ద బంగ్లా.. అందులో ఒక వింత మనిషి.. అనుమానం పెనుభూతం అంటూ అతను ఒక కథ చెబుతుంటాడు. ఆ విజువల్స్, ఆ టేకింగ్, ఆ అప్పియరెన్స్ అంతా ఒక కొత్త క్రియేషన్ లా అనిపిస్తుంది.
కేరాఫ్ కంచెరపాలెం నుంచి వెంకటేష్ మహా మీద అంచనాలు పెరిగాయి. నెక్స్ట్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా కూడా ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు ఆ డైరెక్టర్ మహా అద్భుతంగా చేస్తున్న సినిమా రావు బహదూర్. ఈ సినిమాలో సత్యదేవ్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ కూడా తన వర్సటాలిటీ చూపించేలా ఉంది.
వెంకటేష్ మహా ఉగ్రరూపస్య..
రావు బహదూర్ సినిమాను GMB ప్రొడక్షన్స్ బ్యానర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పిస్తున్నారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్, A+S మూవీస్ లో చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డ్య్, శరత్ చద్ర ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో సత్యదేవ్ కి జతగా దీప థామస్ నటిస్తుంది. మరి టీజర్ తో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా వెండితెర మీద ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.
సత్యదేవ్ తో వెంకటేష్ మహా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా చేశాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ వెంకటేష్ మహా రావు బహదూర్ చేస్తున్నాడు. ఈమధ్యనే కింగ్ డం సినిమాలో శివ రోల్ లో తన నటనతో మెప్పించాడు సత్యదేవ్. మంచి టాలెంట్ ఉన్న ఈ నటుడికి ఒక మంచి సినిమా పడితే బాగుంటుంది అనుకుంటున్న టైం లో రావు బహదూర్ టీజర్ షాక్ ఇచ్చింది. టీజర్ తో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన వెంకటేష్ మహా ఇదే విధంగా సినిమాను ఉండేలా చూసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుందని చెప్పొచ్చు.
